Mrunal Thakur: పిల్లలకి కూడా Sruగారం గురించి అర్థమయ్యేలా చెప్పాలి : మృణాల్ ఠాకూర్
July 3, 2023 / 09:16 AM IST
|Follow Us
‘సీతారామం’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. ఆ సినిమాలో సీత అలియాస్ నూర్ జాన్ పాత్రలో అద్భుతంగా నటించింది ఈ బ్యూటీ. ఆమె లుక్స్ అలాగే డ్రెస్సింగ్ కూడా అందరినీ ఆకర్షించాయి. ‘సీతారామం’ సినిమాకి అన్ని విధాలుగా ఈమె న్యాయం చేసింది. కానీ ఆ తర్వాత ఈమెకు అవకాశాలు ఎక్కువగా రావడం లేదు. అందుకు కారణం ఈమె ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తుండటం అని టాక్ వినిపిస్తోంది.
కానీ మరోపక్క నాని, విజయ్ దేవరకొండ వంటి మిడ్ రేంజ్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. ఇక బాలీవుడ్లో అయితే ఈ అమ్మడు భీభత్సమైన గ్లామర్ షో చేసే క్యారెక్టర్లే చేస్తుంది. తాజాగా ‘లస్ట్ స్టోరీస్ 2 ‘ అనే వెబ్ సిరీస్ ఈ అమ్మడు ముద్దు సన్నివేశాల్లో, బెడ్ రూమ్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. బాలీవుడ్ జనాలు ఏమో కానీ మన తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈమెను అలా చూడటానికి ఇబ్బంది పడుతున్నారు.
ఈ నేపథ్యంలో ‘లస్ట్ స్టోరీస్ 2 ‘ లో Sruగార సన్నివేశాల గురించి మృణాల్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ.. “‘ఈరోజుల్లో Sruగారం, కామం అనేవి కామన్ విషయాలు. ఇంట్లో వాళ్ళు కూడా ఈ విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకోవాలి కూడా.! ఈరోజుల్లో పిల్లలకు Sruగారం అంటే ఏంటి..? అట్రాక్షన్ అంటే ఏంటి..? అనే విషయాలను అర్థమయ్యేలా చెప్పాలి.
అప్పుడే వాళ్ళు ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఉంటారు. ఇబ్బంది పడితే వచ్చి నేరుగా పేరెంట్స్ తో చెప్పుకుంటారు. సిగ్గుపడకుండా.. వాళ్ళని నిజాయితీగా పెంచడానికి ప్రయత్నించాలి” అంటూ చెప్పుకొచ్చింది మృణాల్.