ఇప్పుడంటే రాజు గారు అంటే అందరికీ దిల్ రాజు గుర్తొస్తాడు కానీ.. ఒక పదేళ్ల క్రితం వరకు రాజు అంటే ఎమ్మెస్ రాజు. నిర్మాతగా ఆయన తీసిన సినిమాలు, కథపై ఆయనకు ఉండే పట్టు, ప్రొడక్షన్ పరంగా అయన క్రియేట్ చేసిన స్టాండర్డ్స్ వేరు. మహేష్ తో “ఒక్కడు”, ప్రభాస్ తో “వర్షం” లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ను ప్రొడ్యూస్ చేయడమే కాక.. ప్రభుదేవాను దర్శకుడిగా పరిచయం చేసిన ఘనత కూడా ఎమ్మెస్ రాజుదే. వరుస విజయాలు, ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న తరుణంలో తన స్టోరీ జడ్జ్ మెంట్ మీద కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ తో దర్శకత్వం వైపు అడుగులు వేసారాయన.
తొలుత ఓ కన్నడ సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగులో “వాన” టైటిల్ తో రీమేక్ చేసి డిజాస్టర్ చవిచూశాడు. అనంతరం కుమారుడ్ని హీరోగా పరిచయం చేస్తూ “తూనీగ తూనీగ” అనే సినిమాను తెరకెక్కించి దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, తండ్రిగా బొక్క బోర్లా పడ్డారు. ఆ తర్వాత కొడుకును హీరోగా సెటిల్ చేయడం కోసం నానా అగచాట్లు పడ్డప్పటికీ పెద్దగా ఫలితం లభించలేదు. అయితే.. దర్శకుడిగా ఒక్క హిట్టయినా కొట్టాలన్న ఎమ్మెస్ రాజు కల ఆఖరికి ఇప్పటికి నెరవేరింది. శుక్రవారం టెక్నీకల్ ఇష్యుస్ కారణంగా వాయిదాపడి శనివారం విడుదలైన “డర్టీ హరి”కి వస్తున్న రిసెప్షన్ బాగుంది.
కథ కొత్తది కాకపోయినప్పటికీ.. ఎమ్మెస్ రాజు సినిమాను హ్యాండిల్ చేసిన విధానం బాగుందని మెచ్చుకొంటున్నారు జనాలు. రివ్యూస్ కూడా బాగా వచ్చాయి. ఒకవేళ థియేటర్లలో విడుదలై ఉంటె మంచి హిట్ కొట్టేదని కూడా అంచనాలు వెలువడుతుండడంతో ఎమ్మెస్ రాజు ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఇదే ఫామ్ లో ఆయన మళ్ళీ నిర్మాతగా ఒక సూపర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!