ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!

  • September 12, 2023 / 10:11 PM IST

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు నెలకొన్నాయి. మెగాస్టార్ చిరంజీవితో పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన నిర్మాత ముకేశ్ ఉద్దేశి.. సోమవారం మృతి చెందారు. గత కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఈయన.. చెన్నైలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

గత కొన్నాళ్ల నుంచి కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఈయన్ని ప్రస్తుతం అల్లు అరవింద్ చూసుకుంటున్నారు. త్వరలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ కోసం అన్ని సిద్ధం చేశారు. కానీ ఇంతలోనే ఇలా ముకేశ్ చనిపోవడం ఆయన కుటుంబంతో పాటు ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.

చిరంజీవి హీరోగా హిందీలో నటించిన ప్రతిబంధ్, తెలుగులో ఎస్పీ పరుశురాం మూవీస్ని ముఖేష్ ఉద్దేశి నిర్మించి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత అల్లు అరవింద్తో కలిసి పలు మూవీస్ ను ముఖేష్ నిర్మించారు. గో గోవా డాన్, ద విలన్, కౌన్‌, ఏక్‌ విలన్‌, సారీ భాయ్, కిడ్నాప్, ప్యార్ మైన్ ట్విస్ట్, వంటి ఫేమస్ మూవీస్ ని నిర్మించారు. ఇక ముఖేష్ ఉద్దేశికి భార్య,కుమారుడు ఉన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus