Mukhachitram Review: ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
December 9, 2022 / 08:50 AM IST
|Follow Us
Cast & Crew
విశ్వక్ సేన్, వికాస్ వశిష్ట (Hero)
ప్రియ వడ్లమాని, ఆయేషా ఖాన్ (Heroine)
చైతన్య రావు (Cast)
గంగాధర్ (Director)
ప్రదీప్ యాదవ్ - మోహన్ యెల్ల (Producer)
కాలభైరవ (Music)
శ్రీనివాస్ బెజుగాం (Cinematography)
“కలర్ ఫోటో” చిత్రంతో నేషనల్ అవార్డ్ సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రాజ్ కథ-స్క్రీన్ ప్లే-మాటలు అందించిన చిత్రం “ముఖచిత్రం”. గంగాధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో “సినిమా బండి” ఫేమ్ వికాస్ వశిష్ట, “హుషారు” ఫేమ్ ప్రియ వడ్లమాని జంటగా నటించారు. ట్రైలర్ తో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం నేడు (డిసెంబర్ 09) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం..!!
కథ: హైద్రాబాద్ లో హ్యాండ్సమ్ డాక్టర్ రాజ్ కుమార్ (వికాస్ వశిష్ట), విజయవాడలో ట్యూషన్స్ చెబుతూ తండ్రి పొత్తిళ్లలో పెరిగిన అమాయకురాలు మహతి (ప్రియ వడ్లమాని), బ్లాగ్స్ రాస్తూ డైరెక్టర్ అవ్వడం కోసం ప్రయత్నాలు చేసే ఆధునిక యువతి మాయ (ఆయేషా ఖాన్).
ఈ ముగ్గురి నడుమ నడిచిన ఓ ట్రాయాంగిల్ లవ్ స్టోరీ మహతి జీవితాన్ని ఎలా మార్చింది అనేది మూలకథ. ఆ మూలకథను మలుపు తిప్పిన అంశం ప్లాస్టిక్ సర్జరీ. ఈ ట్రాయాంగిల్ లవ్ స్టోరీకి, ప్లాస్టిక్ సర్జరీకి సంబంధం ఏమిటి? అనేది తెలియాలంటే “ముఖచిత్రం” చూడాలన్నమాట.
నటీనటుల పనితీరు: సినిమా బండి చిత్రంలో అమాయక ఆటోడ్రైవర్ గా ఆకట్టుకున్న వికాస్ వశిష్ట, ఈ చిత్రంలో రాజ్ కుమార్ గా నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్లో అలరించాడు. అతడి వాయిస్ అతనికి పెద్ద ప్లస్ పాయింట్. కళ్ళల్లో, గొంతుకలో గాంభీర్యం బాగా కనబరిచాడు.
ప్రియా వడ్లమాని రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో పర్వాలేదనిపించుకుంది. మహతిగా కాస్త ఇబ్బందిపడింది కానీ.. మాయగా మాత్రం అల్లుకుపోయింది. లాయర్ వశిష్టగా రవిశంకర్ తనదైన శైలి స్క్రీన్ ప్రెజన్స్ తో దుమ్ము దులిపేశారు. ఫస్ట్ కేస్ లాయర్ గా విశ్వక్ సేన్ అతిధి పాత్ర అనుకున్నంతగా వర్కవుటవ్వలేదు.
మాయా ఫెర్నాండెజ్ గా అయేసా ఖాన్, ఫ్రెండ్ రోల్లో చైతన్య రావులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: ముందుగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కాలభైరవ అనే విషయాన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇప్పటివరకూ అతను పని చేసిన సినిమాల్లో.. అతని మార్క్ నేపధ్య సంగీతం లేని ఏకైక చిత్రంగా “ముఖచిత్రం”ను పేర్కొనవచ్చు.
శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ ప్రొజెక్ట్ & బడ్జెట్ కి తగ్గట్లే ఉంది. ఎక్కడా సినిమాటిక్ ఫీల్ కలగకుండా బాగా జాగ్రత్తపడ్డాడు. పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ కూడా సినిమాటోగ్రఫీకి తగ్గట్లుగా ఉంది. జంప్ కట్స్ కూడా ఒక స్పెషల్ ఎఫెక్ట్ అనే ఫీల్ కలిగించడానికి విశ్వప్రయత్నం చేశాడు.
కథ-స్క్రీన్ ప్లే-మాటలు అందించిన సందీప్ రాజ్.. ఎంచుకున్న అంశం మంచిదే అయినా, దాన్ని డీల్ చేసిన విధానం మాత్రం హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యంగా త్రివిక్రమ్ రేంజ్ లో అనవసరమైన ప్రాసల కోసం ప్రాకులాడడం అనేది ఒక సీరియస్ ఇష్యూని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అనేందుకు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంటికి తాళాలు.. ఈమైళ్ళకు పాస్వార్డులు, కోర్టులో కేసులు.. ఇంట్లో దోసలు లాంటి ప్రాసలు చాలానే ఉన్నాయి చిత్రంలో. ఈ ప్రాసల గోలలో కథా గమనాన్ని గాలికొదిలేశారు. ఇక లాజిక్కుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
దర్శకుడు గంగాధర్ కి కాన్సెప్ట్ కనెక్ట్ అవ్వలేదో, లేక ఇష్యూలో సీరియస్ ను తెరపై కన్సీవ్ చేయలేకపోయాడో తెలియదు కానీ.. తెరపై ఎమోషన్స్ ను ఎలివేట్ చేయడంలో బొక్కబోర్లా పడ్డాడు. కథకుడిగా సందీప్ రాజ్ బొటాబోటి మార్కులతో నెట్టుకు రాగా.. దర్శకుడిగా గంగాధర్ మాత్రం విఫలమయ్యాడు.
విశ్లేషణ: సమాజంలో జరుగుతున్న తప్పులను ప్రశ్నిస్తున్నప్పుడు.. కథలో నిజాయితీ ఉంటే సరిపోదు, కథనంలో నిక్కచ్చితనం, పాత్రకు కచ్చితత్వం ఉండాలి. అది లేనప్పుడు ప్రశ్నకు విలువ ఉండదు, సమాధానానికి జస్టిఫికేషన్ ఉండదు. అలా.. గోల్ మిస్సయిన సింమియాగా “ముఖచిత్రం” మిగిలిపోయింది.