కృష్ణ, మురళీ మోహన్ ల మధ్య అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు..!
November 18, 2022 / 04:48 PM IST
|Follow Us
సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం నాడు మరణించారు. స్వల్ప గుండె నొప్పి రావడంతో గచ్చిబౌలి లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. మొదట్లో ఆయన కోలుకుని వస్తారు అని అంతా ఆశించారు. కానీ వైద్యులు ఎంత ప్రయత్నించినా కృష్ణ గారిని కాపడలేకపోయారు. ఇక ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో ఘనంగా జరిగాయి. ఇక కృష్ణ గారు చనిపోయిన దగ్గర్నుండీ ఆయన గొప్పతనం తెలుపుతూ ఎన్నో విశేషాలు గూగుల్ లో వైరల్ అవుతున్నాయి.
ఇక సినీరాజకీయ ప్రముఖులు కృష్ణ గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించడానికి వెళ్ళారు. సీనియర్ నటుడు మురళీ మోహన్ అయితే కృష్ణ పాడె కూడా మోశారు. దానిని బట్టి వీరి మధ్య ఎలాంటి అనుబంధం ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.ఈ విషయాన్ని మురళీ మోహన్ కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఓ సందర్భంలో మురళీ మోహన్.. కృష్ణ గారితో ఉన్న అనుభవం గురించి మాట్లాడుతూ.. ‘ 1956 వ సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు సీఆర్ రెడ్డి కాలేజీలో కృష్ణ, నేను క్లాస్ మెట్స్, బెంచ్ మెట్స్ కూడా.
క్లాస్ రూమ్‌లో ఇద్దరం ఒకే బెంచ్‌లో అది కూడా ముందు వరుసలో కూర్చునే వాళ్లం. అప్పటి నుంచి మా ఇద్దరికీ స్నేహంతో పాటు సినిమాలపై ఇంట్రస్ట్ కూడా పెరిగింది. సినిమా యాక్టర్ అయ్యి.. పడవ లాంటి పెద్ద కారు కొనాలని కృష్ణకి అప్పట్లోనే ఓ ఆశ ఉండేది. అనుకున్నట్లుగానే రెండేళ్ల పాటు శ్రమించి.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.కొన్నాళ్లకు కారు కొన్నాడు. ఆ రోజుల్లో కృష్ణను ఏరా.. ఓరేయ్ పిలిచేవాడిని.
అయితే నేను సినిమాల్లోకి వచ్చేసరికి కృష్ణ స్టార్ హీరో అయ్యాడు. అందుకే సినిమాల్లోకి వచ్చాక అలా ఏరా.. ఓరేయ్ అని పిలిస్తే బాగుండదు అనే ఉద్దేశంతో.. ఏవండీ అని పిలిచేవాడిని. కానీ నేను అలా పిలవడం కృష్ణకు నచ్చేది కాదు..’ ఏయ్.. ఇదేంటి కొత్తగా ఏవండీ అని పిలుస్తున్నావ్ ‘ అని అన్నాడు.’ మీరు పెద్ద స్టార్ హీరో.. అందుకే ఒకప్పటిలా.. ఏరా అని పిలవలేను ‘ అని కృష్ణకి చెప్పాను ” అంటూ చెప్పుకొచ్చారు.