Uday Kiran, Chiranjeevi: చిరంజీవి- ఉదయ్ కిరణ్ ల రిలేషన్ గురించి మురళీ మోహన్ కామెంట్స్ వైరల్..!
July 11, 2022 / 07:02 PM IST
|Follow Us
ఉదయ్ కిరణ్.. కెరీర్ ప్రారంభించిన ఏడాదిన్నరకే అతను స్టార్ హీరో అయ్యాడు. ‘చిత్రం’ ‘నువ్వు నేను’ ‘మనసంతా నువ్వే’ వంటి చిత్రాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశాడు. చాలా మంచి పెర్ఫార్మర్. హార్డ్ వర్కర్ కూడా అని ఇండస్ట్రీలో చాలా మంది చెబుతూ ఉంటారు.మెగాస్టార్ చిరంజీవి కూడా ఇతన్ని ఇంటల్లుడిని చేసుకోవాలి అనుకున్నారు. కానీ అది జరగలేదు. తర్వాత ఇతని సినీ కెరీర్ చాలా వరకు పాడైపోయింది. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ స్టేటస్ ను దక్కించుకున్న ఇతను..
ఎంత ఫాస్ట్ గా స్టార్ అయ్యాడో, అంతే ఫాస్ట్ గా కిందకి పడిపోయాడు. సినిమాలు ప్లాపులయ్యాయి. మార్కెట్ పడిపోయింది. పెళ్లి చేసుకున్నా కూడా ఇతను సంతోషంగా బ్రతకలేదు అని ఇతని సోదరి ఓ సందర్భంలో చెప్పింది. చివరికి 2014 జనవరిలో ఎవ్వరూ ఊహించని విధంగా ఇతను ఉరేసుకుని చనిపోయాడు. ఇదిలా ఉండగా ఇతని గురించి తాజా ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు, నిర్మాత అయిన మురళీమోహన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
మురళీమోహన్ మాట్లాడుతూ.. ‘ఉదయ్ కిరణ్ కు ఒక విధమైన హైపర్ టెన్షన్ ఎక్కువ. విపరీతమైన బిపి లా వచ్చేస్తూ ఉంటుంది.ఆ టైంలో అతను కంట్రోల్ లో ఉండదు. ఒకసారి మేము మాట్లాడి అతన్ని ఒక డాక్టర్ దగ్గర జాయిన్ చేశాం. ఆవిడ కూడా ఇతన్ని సొంత తమ్ముడిని చూసుకున్నట్టు చూసుకుంటూ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండేది. ‘నువ్విలా ఆవేశ పడుతున్నావ్.. ఇలా ఆవేశ పడకూడదు’ అంటూ అతనికి జాగ్రత్తలు చెప్పేది.ఆవిడ చెప్పింది వినేవాడు.. సరే అనే వాడు మళ్ళీ మామూలే.
ఏదైనా కంప్లికేటెడ్ సిట్యుయేషన్ వస్తే బ్యాలన్స్ తప్పేవాడు. అయితే అతని సినిమాలు హిట్ అయిన రోజుల్లో చిరంజీవి గారు ఇతన్ని అభినందిస్తూ ఉండేవారు. ఆయనకి ఇప్పటికీ ఆ లక్షణం ఉంది. ఓ సినిమా హిట్ అయ్యిందీ అంటే ఆ సినిమాకి సంబంధించిన హీరో, కెమెరా మెన్లు.. యూనిట్ మెంబెర్స్ అందరికీ ఫోన్ చేసి థాంక్స్ చెబుతూ ఉంటారు. ఇతనికి కూడా అలాగే చెప్పేవారు. ఉదయ్ కిరణ్… చిరంజీవి గారిని కలుస్తూ ఉండేవాడు.
‘సర్ కారు కొన్నాను చూడండి’ అంటూ అలా అతన్ని దగ్గర చేసుకున్నారు. కుటుంబంలో కూడా కలుపుకుందాం అనుకున్నారు. అదే విషయాన్ని అల్లు అరవింద్ గారికి కూడా చెప్పినట్టు ఉన్నారు. ఆయన రైట్ హ్యాండ్ కదా చిరంజీవి గారికి..! అందుకే చెప్పారు.. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు.మరి ఏమైందో ఏమో.. అది అప్సెట్ అవ్వడం.. తర్వాత సినిమాలు కూడా ఆడకపోవడం.. ఇవన్నీ జరిగాయి. అందుకే అతను కూడా డిస్టర్బ్ అయినట్లు ఉన్నాడు’ అంటూ మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.