జాతీయ అవార్డు జ్యూరి సబ్యులకు మురుగదాస్ సలహా

  • April 15, 2017 / 10:54 AM IST

జాతీయ అవార్డులు ప్రతిభావంతులైన వారికంటే పైరవీలు చేసే వారికే వస్తాయని చాలా మంది విమర్శిస్తుంటారు. గతవారం 64 వ జాతీయ అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. ఆ విజేతల పేర్లు చూసి ఇప్పుడు కూడా జ్యూరి సభ్యులపై పెద్దమనుషుల ఒత్తిడి ఉందని అందరూ ఆరోపించారు. సామాన్యులతో పాటుస్టార్ డైరక్టర్ మురుగదాస్ కూడా ఆ అవార్డుల ప్రకటన వెలువడిన వెంటనే “జ్యూరి సభ్యులపై ఇతరుల ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది” అని ట్విట్టర్లో దైర్యంగా విమర్శించారు. దీనిపై ఢిల్లీ స్థాయిలో పెద్ద చర్చ జరిగింది. అవార్డు జ్యూరి సభ్యులకు అధికారిగా వ్యవహరించిన ప్రియదర్శన్ కి మురుగదాస్ మాటలు ఆవేశాన్ని కలిగించాయి. దీంతో అతను స్టార్ డైరక్టర్ పై కామెంట్లు చేశారు. “ముగుగదాస్ తన కెరీర్లో అన్నీ చెత్త సినిమాలు తీశారు. అటువంటి వ్యక్తి అభిప్రాయాలకు అసలు విలువలేదు. సో అయన మాటలు పట్టించుకోనవసరం లేదు” అని అవహేళన చేశారు.

ఎప్పుడూ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలను తెరకెక్కించే మురుగదాస్ ని విమర్శించడంపై అతని అభిమానులు బాధపడ్డారు. ఆ కామెంట్స్ కి మురుగదాస్ బాధపడుతూ కూర్చోకుండా గట్టిగానే సమాధానం ఇచ్చారు. “అది నా ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదు, దేశంలోని చాలామంది అభిప్రాయం. ఈ చర్చని ఇంతటితో ఆపేస్తే మంచిది. లేకుండా తవ్వితే నిజానిజాలు బయటికి వస్తాయి” అని ప్రియదర్శన్ కి సలహా ఇచ్చారు. ఈ గొడవ రోజురోజుకి పెద్దదవుతూ హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం మురుగదాస్ స్పైడర్ మూవీని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus