Mishkin, Poorna: వచ్చే జన్మలో పూర్ణ కడుపున పుట్టాలనుంది.. మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నారంటే?

  • January 27, 2024 / 05:05 PM IST

డైరెక్టర్ గా, నటుడిగా, మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సెలబ్రిటీలలో మిష్కిన్ ఒకరు. మిష్కిన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించి తమిళంలో తెరకెక్కిన డెవిల్ మూవీ మరో నాలుగు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించి చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈవెంట్ జరగగా ఆ ఈవెంట్ లో మిష్కిన్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. తమిళ డెవిల్ సినిమా పూర్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కగా మిష్కిన్ మాట్లాడుతూ హీరోయిన్ పూర్ణ నాకు తల్లిలాంటిదని వచ్చే జన్మలో పూర్ణ కడుపున పుట్టాలనుందని కామెంట్లు చేశారు.

మూగమూడి, డిటెక్టివ్, సూపర్ డీలక్స్ సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్న మిష్కిన్ ఈ కామెంట్లు చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. పూర్ణ, తనకు మధ్య ఉన్న బంధాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెబుతూ మిష్కిన్ ఈ కామెంట్లు చేశారు. మా జోడీ గురించి కొన్ని పుకార్లు వైరల్ అవుతున్నాయని ఆ పుకార్లలో ఏ మాత్రం వాస్తవం లేదని మిష్కిన్ కామెంట్లు చేశారు. కొంతమంది కావాలని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

హీరోయిన్ పూర్ణ నాకు తల్లిలాంటి వారని మరుజన్మలో ఆమె కడుపున పుట్టాలని ఫీలవుతున్నానని మిష్కిన్ కామెంట్లు చేశారు. పూర్ణ సైతం ఆయన మాటలు విని కన్నీటి పర్యంతం అయ్యారు. ఆదిత్య డైరెక్షన్ లో తెరకెక్కిన డెవిల్ మూవీ పూర్ణకు మంచి పేరును తెచ్చిపెడుతుందేమో చూడాల్సి ఉంది.

పూర్ణ భాషతో సంబంధం లేకుండా ఆఫర్లను అందుకుంటూ ఇతర హీరోయిన్లకు షాకిస్తున్నారు. అభినయ ప్రధాన పాత్రల్లో ఎక్కువగా నటిస్తున్న పూర్ణ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాలి. పూర్ణ పారితోషికం పరిమితంగానే ఉందని తెలుస్తోంది. పూర్ణ (Poorna) రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus