మ్యూజిక్ డైరెక్టర్ తమన్ జీవితంలో అంత ట్రాజెడీ ఉందా…!
November 16, 2020 / 12:55 PM IST
|Follow Us
టాలీవుడ్లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు తమన్.తన సినిమాలకు సంబందించిన ఆడియో వేడుకలలో చిన్న పిల్లాడిలా డ్యాన్స్ లు చేస్తూ… నవ్వుతూ కనిపిస్తాడు తమన్. అయితే ఆ నవ్వు వెనుక ఎన్నో కష్టాలు, నిద్ర లేని రాత్రులు ఉన్నాయన్న సంగతి చాలా మందికి తెలీదు. వివరాల్లోకి వెళితే.. తమన్ తొమ్మిదేళ్ల వయసుకే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టాడట. అయితే 13 ఏళ్లకే అతను తండ్రిని కోల్పోవడంతో.. అతని కుటుంబం కష్టాల పాలయ్యిందట. ఈ క్రమంలో తమనే అతని కుaటుంబాన్ని ఆదుకోవాల్సి వచ్చిందని సమాచారం.
దాంతో అతని చదువుకు స్వస్తిపలికి.. సంగీత దర్శకుడిగా నిలబడడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడట.
తమన్ పూర్తి పేరు సాయిశ్రీనివాస్ తమన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇతను ప్రముఖ దర్శకుడు, నిర్మాత అయిన ఘంటసాల బలరామయ్యగారి మనవడు. నెల్లూరులో పుట్టినప్పటికీ… చెన్నైలో పెరిగాడు. తమన్ తండ్రి పేరు అశోక్ కుమార్. ఈయన ప్రముఖ దర్శకుడు చక్రవర్తి వద్ద డ్రమ్ములు వాయించేవాడట.ఇతని తల్లి సావిత్రి గాయకురాలు. అందుకే తమన్ కు చిన్నప్పటి నుండీ సంగీతం పై ఇష్టం పెరిగింది. అయితే తమన్ తన 13వ ఏటనే తండ్రిని కోల్పోయాడని మాట్లాడుకున్నాం కదా. ఆ టైములో తమన్ 6వ తరగతి చదువుతున్నాడట. అది కూడా పూర్తవ్వలేదని తెలుస్తుంది. నాన్న మరణంతో ఒక్కసారిగా తమన్ జీవితం తారుమారైపోయింది.అప్పటి నుండీ రూ.30 కు కూడా పనిచేసేవాడట.
అటు తరువాత కొన్నాళ్ళకు రీ -రికార్డింగ్ టీంలో జాయినవ్వడం.. అలా కోటి, మణిశర్మ, రెహమాన్ ల వద్ద పనిచేసే అవకాశాలు కూడా దక్కడంతో తమన్ కెరీర్ సెట్ అయ్యిందని తెలుస్తుంది. మణిశర్మ, రహమాన్ వంటి వారి దగ్గర పనిచేసే రోజుల్లో నుండీ స్టార్ హీరోలతో తమన్ కు స్నేహం ఏర్పడిందట. తమన్ ను స్టార్ హీరోలు ఏరి కోరి తమ సినిమాలకు సంగీత దర్శకుడిగా ఎంచుకోవడానికి ఇదొక కారణమని తెలుస్తుంది. అలా తమన్ లైఫ్ ఒక్కో సినిమాకి రూ.30 తీసుకునే రేంజ్ దగ్గర నుండీ ఇప్పుడు ఒక్కో సినిమాకి 1కోటి రూపాయల తీసుకునే రేంజ్ కు వచ్చిందని తెలుస్తుంది.