టికెట్ రేట్లు పెంచినా తప్పు కాదు కానీ.. అదే మైనస్.!
July 8, 2024 / 11:00 AM IST
|Follow Us
ఒకప్పుడు సినిమాలు హిట్టు, ప్లాప్.. అనే తేడా లేకుండా 50 రోజుల పాటు రన్ అయ్యేవి. కొన్ని రోజుల తర్వాత 4 వారాల అలా నిలకడగా రన్ అయ్యేవి. అటు తర్వాత 2 వారాల పాటు రన్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కోవిడ్ తర్వాత లెక్కలు మారిపోయాయి. ఒకప్పుడు బి,సి సెంటర్స్ లో సినిమాలు బాగా ఆడేవి. వీకెండ్ తర్వాత సినిమాని నిలబెడుతూ వచ్చింది వాళ్ళే. కానీ కోవిడ్ తర్వాత లెక్కలు మారిపోయాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. ఇలాంటి టైంలో సినిమా టికెట్ రేట్లు కూడా పెంచేయడం జరిగింది. మరోపక్క ఓటీటీ సంస్థలు కూడా 4 వారాల్లో కొత్త సినిమాలని స్మాల్ స్క్రీన్స్ కి తీసుకొచ్చేస్తున్నాయి.
అందువల్ల.. సాధారణ ప్రేక్షకులు సినిమా కోసం థియేటర్లకు వెళ్లడం లేదు. అయితే ఓటీటీలో చూసుకుందాం లేదంటే టీవీల్లో వచ్చినప్పుడు చూసుకుందాం అంటూ సరిపెట్టుకుంటున్నారు. పెద్ద సినిమాలకి మాత్రమే వీకెండ్లో కొంతవరకు వసూళ్లు వస్తున్నాయి. ఆంధ్రాలో కాకుండా తెలంగాణలో చూసుకుంటే పెద్ద సినిమాల రన్ వీకెండ్ వరకు మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ మొదటి వారం వరకు పెద్ద సినిమాలకి టికెట్ హైక్స్ కోసం మేకర్స్ అప్లై చేసుకుంటున్నారు.
వీకెండ్ వరకు ఓకే కానీ.. మొదటి వారం పూర్తయ్యే వరకు హైక్స్ ఉండటం వల్ల ఆ పెద్ద సినిమాలకి కూడా బుకింగ్స్ ఉండటం లేదు. ఇటీవల వచ్చిన ‘కల్కి..'(Kalki 2898 AD) విషయానికే వద్దాం. నైజాంలో ఈ సినిమా బాగా ఆడింది. కానీ ఆంధ్రాలో వీకెండ్ తర్వాత తగ్గాయి. కారణం టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల. మేకర్స్ వీకెండ్ వరకు టికెట్ రేట్లు హైక్ తీసుకుంటే బాగుంటుంది. కానీ అలా చేయడం లేదు. మరోపక్క టికెట్లు బ్లాకింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. కొన్ని స్క్రీన్స్ లో ఎందుకో తెలీదు.. టికెట్లు బ్లాక్ చేసుకుంటూ సినిమా షో టైంకి రిలీజ్ చేస్తున్నారు.
బహుశా కలెక్షన్స్ ఎక్కువ చూపించుకోవాలి అనేది వారి ఉద్దేశం కావచ్చు. కానీ దాని వల్ల సినిమా చూడాలని ఆసక్తి ఉన్నవారు టికెట్లు బుక్ చేసుకోలేకపోతున్నారు. వీకెండ్ వరకు టికెట్ రేట్లు పెంచుకున్నా పర్వాలేదు.. కానీ వీకెండ్ తర్వాత వాటిని తగ్గించే ప్రయత్నం చేయకపోవడం, అనవసరమైన టికెట్ బ్లాకింగ్ల వల్ల.. కలెక్షన్స్ పై ప్రభావం పడుతుంది. వీటిపై మేకర్స్ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదు అంటే సినిమాని కాపాడుకోవడం లేదు అంటే థియేటర్ల వ్యవస్థ అంతరించిపోయే ప్రమాదం.