తండ్రి కళ్లు మూసి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన అభయ్
May 20, 2017 / 07:22 AM IST
|Follow Us
ఈరోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఎన్టీఆర్ మాత్రం తన కొడుకు అభయ్ రామ్ చెప్పిన శుభకాంక్షలు ప్రత్యేకమని చెప్పారు. తన బర్త్ డే వేడుకలను నిన్న రాత్రి కుటుంబసభ్యుల సమక్షంలో ప్రారంభించారు. తన భార్య లక్ష్మి ప్రణతి, కుమారుడు అభయ్ రామ్లు మొదటి బర్త్డే విషెస్ చెప్పారని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అభయ్ రామ్ విషెస్ చెప్పినప్పుడు దిగిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు. ‘ఫ్యామిలీ టైమ్.. అభయ్ నా కళ్లు ఎందుకు మూశాడో తెలియదంటూ’ భార్య ప్రణతి, అభయ్ లతో ఉన్న ఫొటోను మరో ట్వీట్లో పోస్ట్ చేశారు.
ఓ వైపు ఎన్టీఆర్ జై లవకుశ ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో ఫ్యాన్స్ సంబరపడుతుంటే, ఎన్టీఆర్ పర్సనల్ ఫోటోలు షేర్ చేయడంతో మరింత సంతోషపడుతున్నారు. తారక్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.