నా భర్త గుర్తు చేస్తుంటాడు హలో నీకు పెళ్లైయింది అని: స్వాతి

  • September 5, 2018 / 05:56 AM IST

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేని అమ్మాయి స్వాతి అలియాస్ కలర్స్ స్వాతి. “కలర్స్” అనే టీవి షో హోస్ట్ గా సెలబ్రిటీస్ ను ఇంటర్వ్యూ చేస్తూ కెరీర్ స్టార్ట్ చేసిన స్వాతి ఆ షో ద్వారా సంపాదించుకొన్న పాపులారిటీతో “కలర్స్ స్వాతి”గా మారిపోయింది. ఆ తర్వాత ఆమె ఎన్ని సినిమాల్లో నటించినా జనాలు మాత్రం ఆమెను కలర్స్ స్వాతిగానే గుర్తుపెట్టుకొన్నారు. మోయట్లో ఆమెను కలర్స్ స్వాతి అని పిలుస్తున్నందుకు కోపం వ్యక్తం చేసిన స్వాతి తదనంతరం ప్రేక్షకులు అలాగే అలవాటుపడిపోయారు అనుకోని ఆ పేరుకే ఫిక్స్ అయిపోయింది.

ఈ పదహారణాల తెలుగమ్మాయి ఇటీవల ఓ మలయాళీ పైలట్ అయిన వికాస్ ను పెళ్లాడిన విషయం తెలిసిందే. అమ్మడి పెళ్ళయి అయిదు రోజులవుతోంది. ఇప్పటికీ అమ్మడికి తనకు పెళ్లి అయ్యింది అనే విషయం ఆశ్చర్యం కలిగిస్తోందట. ఈ విషయాన్ని స్వాతి స్వయంగా చెప్పడం విశేషం. “రోజు ఉదయం లేవగానే.. ఏంటి నాకు పెళ్లైపోయిందా అని ఆశ్చర్యపోతుంటాను. అప్పుడప్పుడు నా భర్త వికాస్ గుర్తు చేస్తుంటాడు “హలో నీకు పెళ్లయ్యింది” అంటూ. కానీ నాకు మాత్రం నా బంధువులు, స్నేహితుల మధ్య కాలాన్ని గడుపుతుండడమే గుర్తుంది. నా పెళ్ళికి నా చిన్ననాటి స్నేహితులు అమెరికా నుంచి రావడం అనేది బిగ్గెస్ట్ సర్ ప్రైజ్” అంటూ తెగ కబుర్లు చెబుతూ సిగ్గుపడిపోతుంది కొత్త పెళ్లికూతురు. ఇదే సందర్భంలో పెళ్లి తర్వాత కూడా నటిస్తానని, కాకపోతే కథల ఎంపిక విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తానని స్వాతి చెప్పడం విశేషం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus