రెండో సినిమాని క్యాన్సిల్ చేసిన మైత్రి మూవీ మేకర్స్!
July 16, 2018 / 12:15 PM IST
|Follow Us
శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం… వరుసగా మూడు హిట్స్. ఇది చాలు వారి మైత్రి మూవీ మేకర్స్ కథ సెలక్షన్స్, నిర్మాణపు విలువలు.. ప్లానింగ్ గురించి చెప్పాలంటే. ప్రస్తుతం నాగ చైతన్యతో సవ్యసాచి, విజయ్ దేవర కొండతో డియర్ కామ్రేడ్ సినిమాలు చేస్తున్నారు. ఇందులో స్టార్ హీరో నటించకపోయినప్పటికీ కలక్షన్స్ ఆ స్థాయిలోనే రావచ్చని ట్రేడ్ వర్గాలవారు అంచనా వేస్తున్నారు. అయితే ఇవే కాకుండా మాస్ మహారాజ్ రవితేజ తో రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకదాన్ని శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. గోవా బ్యూటీ ఇలియానా తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రం పేరు అమర్ అక్బర్ ఆంటోనీ. ఈ మూవీ అమెరికాలో షూటింగ్ జరుపుకుంటోంది.
ఇక రెండో మూవీని సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా ఆగిపోయినట్లు ఫిలిం నగరవాసులు చెప్పారు. కారణం ఏమిటని ఆరా తీయగా.. ప్రధానంగా రెండు విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. అందులో ఒకటి స్క్రిప్ట్. ఈ కథ తమిళ సినిమాకి రీమేక్ అయినప్పటికీ తెలుగు నేటివిటీకి తగ్గట్టు డైరక్టర్ మార్పులు చేయడంలో విఫలం అయ్యారని తెలిసింది. మరొకటి రవితేజ గత సినిమాలు. రెండేళ్ల గ్యాప్ తర్వాత రాజా ది గ్రేట్ తో మంచి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన టచ్ చేసి చూడు, నేల టికెట్ రెండూ బాగా నిరాశపరిచాయి. సో మరో హిట్ పడితేగానీ బిజినెస్ పెరిగే ప్రసక్తే లేదు. అందుకే రవితేజతో ఒక్కటి చాలు, అది హిట్ అయితే రెండో సినిమా చేద్దామని నిర్మాతలు నవీన్, రవి, మోహన్ ఫిక్స్ అయ్యారని తెలిసింది.