ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’
May 3, 2018 / 09:38 AM IST
|Follow Us
ఈ సమ్మర్ చిత్రాల్లో భారీ అంచనాలతో మే 4న విడుదలౌతున్న స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కి సాంకేతికపరమైన అదనపు హంగులు తోడయ్యాయి. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు, మలయాళం, తమిళంలోనూ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. భాషకు సంబంధించిన ఎక్కడా ఏ సమస్యలు తలెత్తకుండా ఎక్స్ ఎల్ సినిమాస్ సరికొత్త ప్రయోగం చేసింది. మొట్ట మొదటి సారిగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంతో ఈ కొత్త అనుభవాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంది. ఈ సరికొత్త అప్లికేషన్ ను బ్రాజ్మా ఇంటెలిజెంట్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అధినేతలు దీప్తి ప్రసాద్, కునాల్ ప్రసాద్ రూపొందించారు.
దీనికి సంబంధించిన వివరాల్ని ఎక్స్ ఎల్ సినిమా ఆప్ ఫౌండర్ కునాల్ ప్రసాద్ మాట్లాడుతూ…. ఎక్స్ ఎల్ సినిమా యాప్ అనేది సినిమా అభిమానులకు సరికొత్త ఎక్స్ పీరియెన్స్ ఇస్తుందని గర్వంగా చెప్పగలం. ఓ భాషలో సినిమా చూస్తున్నప్పుడు… మరొక భాషలో ఆడియో వినాలనుకుంటే ఎక్స్ ఎల్ సినిమా యాప్ ద్వారా మాత్రమే సాధ్యమౌతుంది. ఇప్పుడీ ప్రయోగాన్ని అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం ద్వారా ప్రేక్షకులకు అందించనున్నాం. ఉదాహరణకు… మీరు చెన్నైలో తెలుగు వెర్షన్ నా పేరు సూర్య చిత్రం చూస్తున్నప్పుడు…. మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఎక్స్ ఎల్ సినిమా యాప్ ఓపెన్ చేసి నా పేరు సూర్య ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆడియో టికెట్ ద్వారా తమిళం భాషను ఎంచుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే తమిళంలో మీరు సినిమాను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మీ కళ్ల ముందు ఉన్న తెరమీద తెలుగు సినిమా ప్రదర్శిస్తున్నప్పటికీ… మీరు పెట్టుకున్న హెడ్ ఫోన్స్ నుంచి తమిళం డైలాగ్స్ వస్తుంటాయి. సో… మీరు తమిళంలోనే సినిమా చూస్తున్నట్టు లెక్క. ఇలా చూడటానికి మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించక్కర్లేదు. కేవలం యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని రిజిష్టర్ చేసుకుంటే సరిపోతుంది. ఆండ్రాయిడ్ ఫోన్, హెడ్ ఫోన్స్ తప్పనిసరి. పెద్దగా ఛార్జింగ్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఆడియో సింక్రనైజేషన్ లో ఎలాంటి లోపాలు లేకుండా దీన్ని తీర్చిదిద్దాం. సో.. రియల్ టైంలో ఆడియో సింక్రనైజ్ అవుతుంది. ఇలాంటి అప్లికేషన్ పాన్ సౌత్ ఇండియాలో హై రేంజి బిజినెస్ వున్న హీరో అల్లు అర్జున్ లాంటి స్పాన్ వున్న హీరోలకి వాడితేనే దీని విలువ తెలుస్తుందని .. అందుకు ఇలాంటి అవకాశాన్ని మాకు అందించిన స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, నిర్మాతలు నాగబాబు గారు, లగడపాటి శ్రీథర్ గారు, బన్ని వాసు గారికి మా ప్రత్యేఖ థన్యవాదాలు.. అని అన్నారు.