ఇంటర్వ్యూ : ‘నా సామి రంగ’ గురించి దర్శకుడు విజయ్ బిన్నీ చెప్పిన ఆసక్తికర విషయాలు..!

  • January 7, 2024 / 02:14 PM IST

నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘నా సామిరంగ’ సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం ద్వారా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌’ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ డోస్ పెంచారు. ఈ క్రమంలో దర్శకుడు విజయ్ బిన్నీ పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. అవి మీకోసం :

ప్ర) కొరియోగ్రాఫర్ నుండి డైరెక్టర్ గా మారడం అనేది ఎలాంటి ఫీలింగ్ ఇచ్చింది?
విజయ్ బిన్ని : మొదటి నేను డైరెక్టర్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఇండస్ట్రీకి వచ్చాను. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమా తర్వాత కొరియోగ్రాఫర్ పట్ల గ్రిప్ ఉంది అని భావించి అటు వైపు వెళ్లాను.

ప్ర) డైరెక్టర్ గా మొదటి సినిమానే నాగార్జున గారితో చేశారు.. ఆ ఛాన్స్ ఎలా వచ్చింది?
విజయ్ బిన్ని : గతంలో నాగార్జున గారి సినిమాల్లో కొన్ని పాటలకి కొరియోగ్రఫీ చేశాను. అప్పుడు ఏర్పడిన చనువు వల్ల నాకు ఇంత త్వరగా ఆయన సినిమాకి డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది.దర్శకుడిగా నా తొలి సినిమానే నాగార్జున గారితో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

ప్ర)’నా సామి రంగ’ కథ నాగార్జున గారినే దృష్టిలో పెట్టుకునే డిజైన్ చేసుకున్నారా?
విజయ్ బిన్ని : లేదు.. ముందు నేను ఆయనకు వేరే కథ చెప్పాను. కానీ తర్వాత ఆయన ఓ రోజు నన్ను పిలిచి ‘నా సామి రంగ’ కథ గురించి చెప్పి చేస్తావా? అని అడిగారు. అప్పుడు నేను సంతోషంతో ఒప్పేసుకుని.. ఆ కథని ఓన్ చేసుకొని నా స్టయిల్ లో చేశాను. ఇందులో చాలా హైస్ ఉంటాయి.మీ అందరికీ వింటేజ్ నాగార్జున గారు కనిపిస్తారు. నేను నాగార్జున గారిని ఎంత డిఫరెంట్ గా చూపించాలని అనుకున్నానో అంత డిఫరెంట్ గా చూపించగలిగాను.

ప్ర) కొరియోగ్రఫీ చేయడం కష్టమా.. డైరెక్షన్ చేయడం కష్టమా?
విజయ్ బిన్ని : మొదటి నుండి నాకు డైరెక్షన్ పైనే ఆసక్తి ఉంది. కొరియోగ్రఫీ కూడా ఎక్కువ స్టోరీ టెల్లింగ్ ఉన్న పాటలే చేశాను. కానీ నాకు డైరెక్షన్ విషయంలో కష్టపడలేదు.

ప్ర) ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా నటించారు.. వాళ్ళ పాత్రలు ఎలా ఉండబోతున్నాయి?
విజయ్ బిన్ని : ముందుగా ఇది మాస్ మూవీ, కమర్షియల్ మూవీ అని అనడం కాదు. ఇది ఒక ఫ్రెండ్షిప్ బేస్ మూవీ.నిజజీవితంలో నరేష్ గారు నాగార్జున గారికి పెద్ద ఫ్యాన్. అందుకే వాళ్ళ కాంబో బాగుంటుంది అనిపించింది. నరేష్ గారు అద్భుతంగా చేశారు, వీళ్ళిద్దరితో పాటు ఇంకో యంగ్ క్యారెక్టర్ కి యంగ్ హీరో ఉంటే బాగుణ్ణు అని భావించి రాజ్ తరుణ్ గారిని తీసుకోవడం జరిగింది. ముగ్గురికీ కూడా డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. అయితే ముగ్గురికీ కనెక్షన్ ఎలా ఉంటుంది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ప్ర) ఇంత ఫాస్ట్ గా సినిమాని కంప్లీట్ చేయడం అంటే మాటలు కాదు. నాగార్జున గారు కూడా మిమ్మల్ని తెగ పొగుడుతున్నారు. ఎలా అనిపిస్తుంది?

విజయ్ బిన్ని : నిజంగా నాగార్జున గారైతే చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా మంది దర్శకులు ఆయనతో పనిచేశారు. మరి ఏ రకంగా నన్ను పొగుడుతున్నారో ఆయన చెబితేనే బాగుంటుంది. నాగార్జున గారు నరేష్, రాజ్ తరుణ్.. బాగా సపోర్ట్ చేశారు కాబట్టే.. ఈ సినిమాని ఫాస్ట్ గా తీయగలిగాం.

ప్ర) ‘ఆస్కార్’ అవార్డు అందుకున్న తర్వాత కీరవాణి గారు చేసిన ఈ సినిమా మ్యూజిక్ గురించి చెప్పండి?
విజయ్ బిన్ని : నేను కొత్త దర్శకుడిని అని కీరవాణి గారు తక్కువ చేసి చూసింది లేదు. ఆయన సపోర్ట్ నాకు బాగా హెల్ప్ అయ్యింది. నేను కొరియోగ్రఫర్ ని కాబట్టి నాకు కూడా మ్యూజిక్ సెన్స్ ఉంది. అందుకే మా మధ్య సింక్ కూడా బాగా కుదిరింది. పాటలు బాగా వచ్చాయి. మాస్ సినిమాకి తగ్గ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడంలో ఆయన దిట్ట.

ప్ర) ఈ సినిమాకి టైం పీరియడ్ ఉంటుందా?
విజయ్ బిన్ని : అవును.. ఇది 1980-90..ల టైంలో జరిగే కథ ఇది.

ప్ర) ‘నా సామిరంగ’ టైటిల్ ఆలోచన ఎవరిది ?
విజయ్ బిన్ని : ఏఎన్ఆర్ గారి సినిమాలో ఓ పాటలోని లిరిక్స్ ఆధారంగా ఈ టైటిల్ గా తీసుకోవడం జరిగింది.

ప్ర)సినిమా ఇంత ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి నిర్మాత ఎంతవరకు సపోర్ట్ చేశారు?
విజయ్ బిన్ని : నిర్మాతలు కూడా బాగా సపోర్ట్ చేశారు. ఏం కావాలన్నా వెంటనే సమకూర్చేవారు. వారి సపోర్ట్ కూడా లేనిదే ఇది సాధ్యమవ్వదు.

ప్ర)మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి?
విజయ్ బిన్ని : ‘నా సామి రంగ’ రిజల్ట్ ని బట్టి.. ప్లాన్ చేసుకోవాలి.

ప్ర)మీ డ్రీం ప్రాజెక్ట్ అంటూ ఏమైనా ఉందా?
విజయ్ బిన్ని : నాకు అన్ని జోనర్లలో సినిమాలు చేయాలని ఉంది.

Read Today's Latest Interviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus