Vijay Binni, HanuMan: ‘హను – మాన్‌’కి పని చేసిన ‘నా సామిరంగ’ దర్శకుడు.. ఎలా అంటే?

  • January 11, 2024 / 01:56 PM IST

‘నా సామిరంగ’ సినిమా దర్శకుడు విజయ్‌ బిన్ని తెలుసా? కొత్త దర్శకుడు కదా, ఎలా తెలుస్తుంది అని అనొచ్చు. అయితే ఆయన ఇప్పటికే 100 సినిమాలకు పని చేశారు అని చెబితే అప్పుడు ఆలోచిస్తారు. అయితే దర్శకత్వ విభాగంలో కాదు. ఎందుకంటే విజయ్‌ బిన్ని అంటే డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌. మొత్తంగా సెంచరీ సినిమాలకు పని చేయడం ఆసక్తికరమే. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఆయన కొరియోగ్రఫర్‌గా సింగిల్‌ కార్డ్‌లో చేసిన సినిమా, డైరక్టర్‌గా చేసిన తొలి సినిమా ఒకేసారి రిలీజ్‌ అవుతుండటం.

డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్లకు సింగిల్‌ కార్డు అంటే పెద్ద ఘనతే అని చెప్పాలి. అలాంటి ఘనతను ఆయన ‘హను – మాన్‌’తో మరోసారి సాధించారు ఆయన. ఇక ఎన్నో రోజులుగా ఆయన ప్రయత్నం చేస్తున్న డైరక్షన్‌ ఛాన్స్‌ ‘నా సామిరంగ’తో ఇచ్చారు అక్కినేని నాగార్జున. ఈ సినిమాలు రెండూ సంక్రాంతికే వస్తున్నాయి. దీంతో ఈ పొంగల్‌ ఆయనకు చాలా స్పెషల్‌ అని చెబుతున్నారు. మామూలుగానే విజయ్‌ బిన్ని మాంటేజ్‌ సాంగ్స్‌కి ఫేమస్‌. ‘హను – మాన్‌’లో పాటలు అన్నీ ఇలానే ఉన్నాయట.

అలా కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్ని వర్సెస్‌ డైరక్టర్‌ విజయ్‌ బిన్ని అనేలా ఈ ఏడాది ముగ్గుల పండగ ఫైట్‌ మారింది. ‘నా సామిరంగ’ షూటింగ్ మొదలు కాకముందే ‘హను – మాన్‌’ సాంగ్స్‌ పూర్తయిపోయాయి. అప్పుడే విజయ్‌ బిన్ని పని పూర్తి చేశారట. అంతేకాదు మాంటేజ్ సాంగ్స్‌ చేయడం వల్ల దర్శకత్వం చేయడానికి చాలా ఈజీ అయ్యిందని విజయ్ బిన్ని అంటున్నారు. అందులో చూపించిన క్రియేటివిటీ సినిమాలకు పనికొచ్చిందట.

ఇక విజయ్‌ బిన్ని(Vijay Binni) … సినిమా పరిశ్రమలోకి డైరెక్షన్ చేయాలనే వచ్చారట. అయితే బేసిగ్గా డాన్సర్ కావడంతో తొలుత ఇటు వచ్చారట. కొరియోగ్రఫీ చేయడం వల్ల సినిమాలో అన్ని క్రాఫ్ట్స్‌ మీద అవగాహన పెంచుకోవడానికి అవకాశం కలిగింది అని చెప్పారాయన. ఆ అనుభవంతోనే ‘నా సామిరంగ’ సినిమాను మూడు నెలల్లోనే పూర్తి చేశాం అన్నారాయన.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus