నరేష్ ‘నాంది’ కి.. నితిన్ ‘చెక్’ పెద్ద హెల్ప్ చేసినట్టే…!

  • February 6, 2021 / 10:00 AM IST

నితిన్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ లు హీరోయిన్లుగా.. విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన చిత్రం ‘చెక్’. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కాన్సెప్ట్ తో పాటు థ్రిల్ చేసే ఎలిమెంట్స్ అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ కు లోటు లేకుండా ఈ ట్రైలర్ ఉంది. యూట్యూబ్ లో ఇప్పటికే 10 మిలియన్ వ్యూస్ ను కొల్లట్టింది ఈ చిత్రం ట్రైలర్.

దాంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూస్తామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. నిజానికి ఫిబ్రవరి 19న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు కానీ.. ఇప్పుడు ఓ వారం వెనక్కి జరిగింది. అంటే ఫిబ్రవరి 26న ఈ చిత్రం విడుదల కాబోతుంది. దాంతో ఇప్పుడు అదే రోజున అల్లరి నరేష్ ‘నాంది’ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి ఆ చిత్రం దర్శకనిర్మాతలు ముందుకు వచ్చారు. అవును ‘నాంది’ చిత్రం ఫిబ్రవరి 19నే విడుదల కాబోతుంది.

ఒకవేళ అదే రోజున ‘చెక్’ కూడా విడుదలయ్యి ఉంటే.. ‘నాంది’ కి పెద్ద దెబ్బే పడేది. అసలే నరేష్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు అన్నీ నిరాశపరిచాయి. దాంతో చాలా కష్టపడి ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ చేసాడు. విజయ్ కనకమేడల డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సతీష్ వేగేశ్న నిర్మించాడు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే.. ‘చెక్’ లో నితిన్ జైలు శిక్ష పడ్డ ఖైదీ.. ‘నాంది’ లో కూడా అంతే… నరేష్ ఖైదీనే కావడం విశేషం.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus