బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో జతకడుతున్న నభా నటేష్

  • November 28, 2019 / 11:28 AM IST

ఒక హీరో సినిమా మొదలవుతుంది అంటే.. దర్శకుడు ఎవరు, జోనర్ ఏమిటి, ప్రొడక్షన్ హౌజ్ ఏది, ఎప్పుడు మొదలవుతుంది, టైటిల్ ఏంటీ అని ఆలోచిస్తారు. కానీ.. విచిత్రంగా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా మొదలవుతుంటే మాత్రం అందరి ప్రశ్న ఒక్కటే “హీరోయిన్ ఎవరు?”. బెల్లంకొండ సినిమా అంటే అందులో స్టార్ హీరోయిన్ లేదా పాపులర్ హీరోయిన్ ఉండడం ఖాయం అని ఫిక్స్ అయిపోయారు జనాలు. అంటే.. ఇప్పటివరకు వచ్చిన బాబు సినిమాలు కూడా అలానే ఉన్నాయనుకోండి.

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా రేపు కొత్త సినిమా మొదలవుతుంది. దాంతో సహజంగానే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న తలెత్తింది. అయితే.. ఈ చిత్రంలో ప్రెజంట్ ఇండస్ట్రీ మోస్ట్ వాంటెడ్ & పాపులర్ హీరోయిన్ అయిన నభా నటేష్ ను నాయికగా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. మొత్తానికి బెల్లంబాబు మళ్ళీ స్టార్ హీరోయిన్ కే గాలం వేశాడన్నమాట.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus