మహానటుడు నందమూరి తారక రామారావు సినిమా లైఫ్ లో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయో.. రాజకీయాల్లో అంతకంటే ఎక్కువ మలుపులు ఉన్నాయి. అంతటి మహా జీవితాన్ని మూడు గంటల్లో చూపించడానికి తేజ కష్టపడుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ని కంప్లీట్ చేసిన తేజ.. ఆర్టిస్టుల సెలక్షన్ లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ గా బాలకృష్ణ కనిపించనున్నా సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన సమయంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు. అప్పుడు ఇందిరా గాంధీకి ఎన్టీఆర్ కి మధ్య గొడవ జరిగిందని.. ఆమెను ఎదిరించిన తొలి తెలుగువాడిగా ఎన్టీఆర్ వార్తల్లో నిలిచారు. అందుకే కోపంతో ఇందిరాగాంధీ ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించడానికి ప్రయత్నించింది.
అప్పుడు ఎన్టీఆర్ చేసిన పోరాటం.. ఈ సినిమాలో కీలకం కానున్నాయి. అందుకోసమే ఇందిరాగాంధీ పాత్రకు నదియాను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ పాత్రకు నదియా సరిగ్గా సూట్ అవుతుందని యూనిట్ మొత్తం ఆమె కావాలని పట్టుబట్టారు. అయితే నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ కావడంతో నదియా రెమ్యునరేషన్ ఎక్కువగా అడిగినట్లు చెప్పుకుంటున్నారు. ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాత సాయి కొర్రపాటి ఒకే చెప్పారు. ఈ పాత్రతో పాటు ఇందిరాగాంధీకి సలహాలు ఇచ్చిన మాజీ పివి నరసింహారావు పాత్రకోసం ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడుని అడుగుతున్నట్లు సమాచారం. మొత్తానికి ఎన్టీఆర్ బయోపిక్ రాను రాను మరింత ఆసక్తికరంగా మారుతోంది.