Kalki: ఆ టెక్నాలజీని అద్భుతంగా వాడుకున్న నాగ్ అశ్విన్.… అసలేమైందంటే?
April 22, 2024 / 01:44 PM IST
|Follow Us
గత కొన్నేళ్లలో సినిమాలను చూసే విషయంలో భారతీయ సినీ ప్రేక్షకుల అభిరుచి పూర్తిస్థాయిలో మారిపోయిందనే చెప్పాలి. సాధారణ సినిమాలతో పోల్చి చూస్తే విజువల్ వండర్స్ గా తెరకెక్కిన సినిమాలకు ప్రాధాన్యత అంతకంతకూ పెరుగుతోంది. అదే సమయంలో నాసిరకం గ్రాఫిక్స్ తో తెరకెక్కిన సినిమాలు సైతం ప్రేక్షకులను మెప్పించడం లేదు. గ్రాఫిక్స్ మరీ ఘోరంగా ఉంటే సోషల్ మీడియాలో ఆ సినిమాలను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆచార్య సినిమా రిలీజ్ సమయంలో డీ ఏజింగ్ టెక్నాలజీ సహాయంతో చూపించిన చిరంజీవి లుక్ పై ఏ స్థాయిలో విమర్శలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) మూవీ నుంచి తాజాగా అమితాబ్ (Amitabh Bachchan) పోషిస్తున్న అశ్వథ్థామ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ కాగా ఈ గ్లింప్స్ లో అమితాబ్ ను యంగ్ లుక్ లో చూపించడంపై ప్రశంసలు వ్యక్తమవువుతున్నాయి. డీ ఏజింగ్ టెక్నాలజీని నాగ్ అశ్విన్ (Nag Ashwin) అద్భుతంగా ఉపయోగించుకున్నాడని అదే సమయంలో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచడంలో సక్సెస్ అయ్యాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.
కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించి ఉంటే ఫ్యాన్స్ మరింత సంతోషించే వారని చెప్పవచ్చు. జూన్ 27వ తేదీన ఈ సినిమా విడుదలవుతుందని వార్తలు వినిపిస్తున్నా అధికారికంగా మాత్రం క్లారిటీ లేదు. కల్కి 2898 ఏడీ మూవీ నుంచి రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అమితాబ్ గ్లింప్స్ కు యూట్యూబ్ లో 3.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
ఈ వీడియో యూట్యూబ్ లో నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ లో ఉంది. ప్రభాస్ (Prabhas) ఈ సినిమాలో భైరవ రోల్ లో కనిపించనున్నారు. ప్రతి పాత్రకు ప్రత్యేకత ఉండేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. 2024 బిగ్గెస్ట్ హిట్ గా కల్కి నిలుస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.