ఆ టైమ్‌లో నాకు మెచ్యూరిటీ లేదు.. నా పిల్లల విషయంలో తప్పు చేశాను : నాగబాబు
November 25, 2020 / 11:15 AM IST
|Follow Us
మెగా బ్రదర్ నాగబాబు ఏం మాట్లాడినా.. అందరికీ అర్ధమయ్యేలా చాలా క్లుప్తంగా మాట్లాడుతూ ఉంటారు. ఇటీవల ఈయన కొడుకు, కూతురి గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ‘మన ఛానల్ మన ఇష్టం’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా తన మనసులోని భావాలను తన అభిమానులతో పంచుకుంటూ వస్తున్నాడు నాగబాబు. ఇటీవల ఓ వీడియో ద్వారా వరుణ్ తేజ్, నిహారికల గురించి స్పందిస్తూ :
“నేను గొప్ప కమ్యూనికేటర్‌ని కాకపోవచ్చు కానీ.. ఎంతోకొంత బెటర్ అనేది నా ఫీలింగ్.అప్పట్లో నేను నా పిల్లలు నిహారిక, వరుణ్‌లకు చాలా విషయాలు కూలంకషంగా చెప్పేవాడిని. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తిట్టడం, కొట్టడం వంటివి కూడా చేసేవాడిని. నిహారిక, వరుణ్‌లను ఒకటి రెండు సార్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే పిల్లలను అలా కొట్టడం తప్పు. ఆ టైమ్‌లో నాకు దీని పై సరైన అవగాహన లేదు. పిల్లలకు నేను ఎప్పుడూ ఒక్కటే చెబుతాను.. మీరు మీ తల్లిదండ్రులతో ఫ్రీ గా మాట్లాడండి. అన్ని విషయాలు షేర్ చేసుకోండి. నా పిల్లలిద్దరినీ పిలిచి వాళ్లకు ఓ గ్యారెంటీ ఇచ్చాను. ఈ భూమ్మీద మీ జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా నేనొక్కడిని మాత్రమే మీ సమస్యను సరిగ్గా అర్థం చేసుకొని పరిష్కారం చూపగలను. అది చెప్పుకోలేని సమస్య అయినా సరే.. నాతో చెప్పండి. ఎందుకంటే ఈ భూమి పై మీకంటే నాకు విలువైన వాళ్ళు ఎవ్వరూ లేరు.
నా పిల్లలతో కమ్యూనికేట్ కావడంలో ఎలాంటి దాపరికాలు పెట్టుకోలేదు. వరుణ్ డిగ్రీ చదువుతున్న రోజుల్లో సినిమాల్లోకి వస్తాను అన్నాడు. అందుకు నేను ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పాను. అయితే వరుణ్ కు ఒక్కటే చెప్పాను. ఒకవేళ నటుడిగా సక్సెస్ కాకపోతే డిజప్పాయింట్ అవ్వొద్దు అని. అలా అని ప్రయత్నంలో లోటుండకూడదు. ‘నేను పెద్ద హీరో కాకపోతే నాన్నకు మాటిచ్చాను.. ఇప్పుడెలా’ అని ఫీలవ్వొద్దు.. నువ్ ఎలా ఉన్నా సరే యూ ఆర్ మై సన్’ అని ధైర్యం చెప్పాను. అదేవిధంగా నిహారికకు కూడా చెప్పా. మీరు ఏదైనా సాధించినా, సాధించకపోయినా అది పర్సనల్. కానీ నా కొడుకు, కూతురు సక్సెస్ కాలేదని నేను బాధపడను. నాకు నా పిల్లలు సంతోషం ముఖ్యం. అంతే.. అలానే వాళ్ళను మోటివేట్ చేశాను” అంటూ చెప్పుకొచ్చాడు.