నాగబాబు ఇలా దొరికిపోయాడేంటి.. నెటిజన్లు బాగా ఆడేసుకున్నారు..!

  • January 7, 2021 / 08:36 PM IST

మెగా బ్రదర్ నాగబాబు.. ఈ మధ్యకాలంలో ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే వస్తున్నాడు. గతంలో నందమూరి బాలకృష్ణ విషయంలో నాగబాబు చేసిన నెగిటివ్ కామెంట్లకు.. ఆయన అభిమానులు ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. అయినా సరే.. ఛాన్స్ దొరికిన ప్రతీసారీ నాగబాబు.. బాలయ్య పై విరుచుకుపడుతూనే ఉన్నాడు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ఈ మధ్యకాలంలో నాగబాబు సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్ గా ఉంటూ వస్తోన్న సంగతి తెలిసిందే.

తన యూట్యూబ్ ఛానెల్ లో పలు అంశాల పై స్పందిస్తూ వీడియోలను పోస్ట్ చెయ్యడమే కాకుండా.. తన ఫేస్బుక్ ద్వారా సన్నిహితులకు పెద్ద పెద్ద సెలబ్రిటీలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు వేస్తున్నాడు. ఇదే క్రమంలో నిన్న.. అంటే జనవరి 6న ఏ.ఆర్.రెహమాన్, కపిల్ దేవ్ వంటి ఇద్దరు లెజెండ్స్ పుట్టినరోజు కావడంతో వారికి విషెస్ చెబుతూ ట్వీట్లు వేసాడు నాగబాబు. అయితే కపిల్ దేవ్ పై ట్వీట్ వేస్తున్నప్పుడు.. కపిల్ దేవ్ ఫోటోని షేర్ చెయ్యడం మర్చిపోయి పొరబాటున..

కపిల్ దేవ్ బయోపిక్ గా రూపొందుతోన్న ’83’ సినిమాలోని రణ్వీర్ సింగ్ ఫోటోని షేర్ చేసాడు.ఆ పోస్ట్ తెగ వైరల్ అయిపోయింది. అంతే ఇక నెటిజన్లకు.. మంచి ఫీస్ట్ దొరికేసింది. ‘కపిల్ దేవ్ ఫోటో ఎదో కూడా తెలీడం లేదా నీకు’ ‘ఈ ఫోటోలో ఉన్నది రణ్వీర్ సింగ్.. కపిల్ దేవ్ కాదు’ అంటూ ఓ రేంజ్లో నాగబాబుని ట్రోల్ చేశారు నెటిజన్లు. దాంతో వెంటనే రియలైజ్ అయిన నాగబాబు.. ఆ పోస్ట్ ను డిలీట్ చేసాడు. అయినా సరే.. జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus