జనసేనకు చిరు మద్దతు ఉండదు.. క్లారిటీ ఇచ్చినాగ బాబు
May 1, 2020 / 04:29 PM IST
|Follow Us
చిరంజీవి రాజకీయ జీవితం పి ఆర్ పి పార్టీతోనే ముగిసింది. ఆయన ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపివేసి పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఆ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన పవన్ అప్పట్లో అన్న చిరు పైనే విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంటున్నారు. ఇక పవన్ చిన్న అన్నయ్య నాగ బాబు కూడా జనసేన పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ, పార్టీ ప్రధాన సభ్యులలో ఒకరిగా కొనసాగుతున్నారు.
గత ఎన్నికలలో ఆయన ఎమ్ పి గా జనసేన పార్టీ తరపున పోటీచేసి పరాజయం పొందారు. కాగా నాగబాబు కొన్నాళ్లుగా నా ఇష్టం పేరుతో ఓ యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించి, మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల విశేషాలు, జనసేన పార్టీ కారక్రమాలు, ప్రత్యర్ధుల రాజకీయ విమర్శలకు సమాధానాలు.. ఇలా అనేక విషయాలు ఆ ఛానల్ వేదికగా పంచుకుంటున్నారు. ఐతే చిరంజీవి జనసేన పార్టీలోకి వచ్చే ఆలోచన ఉందా..అని ఓ అభిమాని అడుగగా ఆయన క్లారిటీ ఇచ్చారు.
చిరంజీవి రాజకీయాల వైపు వెళ్లకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఆయన జనసేనలో చేరితే మళ్ళీ రాజకీయాలలోకి వచ్చినట్లు అవుతుంది. కాబట్టి ఆయన తన అనుభవం మరియి సేవా గుణం చిత్ర పరిశ్రమకు ఉపయోగించాలని అనుకుంటున్నారు.కాబట్టి చిరంజీవి జనసేన లో చేరడు అనేది నా గట్టి నమ్మకం అన్నారు. ఇక భవిష్యత్ మనం అంచనా వేయలేము కాబట్టి ఏదైనా ఆయన మనసు మారి వస్తే రావచ్చ అన్నారు.