Naga Babu: రోజా పై నాగబాబు షాకింగ్ కామెంట్స్ వైరల్..!

  • January 7, 2023 / 12:01 PM IST

వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రోజా ఛాన్స్ దొరికిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూ ఉంటుంది. ఇటీవల ‘చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు.. లను వారి సొంత జిల్లాల్లోనే ప్రజలు ఓడించారు అంటే వీళ్ళ పై జనాలకు నమ్మకం లేదని అర్థమవుతుంది. సినిమా వాళ్ళు సెన్సిటివ్ గా ఉంటారు కానీ వీళ్ళు మాత్రం అందుకు భిన్నంగా’ ఉంటారు అంటూ ఇష్టమొచ్చిన కామెంట్లు చేసింది. పవన్ కళ్యాణ్ ని మళ్ళీ ప్యాకేజీ స్టార్ అంటూ ఎద్దేవా చేసింది.

ఈ క్రమంలో నాగబాబు రోజా పై మండిపడుతూ ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ” రోజా.. భారతదేశపు రాష్ట్రాల పర్యాటక శాఖ ర్యాంకింగ్స్ లో ఉన్న 20 స్థానాల్లో మొదటి 3 స్థానాలు.. అంటే కేరళ, అస్సాం, గుజరాత్ వంటి మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 18 వ స్థానంలో ఉంది. ఇంకా కిందికి వెళ్తే.. ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్ ఉన్నాయి. నువ్వు ఇలాగే నీ బాధ్యతలు మర్చిపోయి నోటికి వచ్చినట్టు, పిచ్చపిచ్చగా మాట్లాడితే అతి త్వరలో అంటే నువ్వు పదవి దిగిపోయే లోగా 20వ స్థానానికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మేళ కొన్ని వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా నిర్వహిస్తున్నారు. మీ వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు మట్టిగొట్టుకు పోయాయి. నువ్వు ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాళ్ళ పరిస్థితి మరీ దిగజారిపోతుంది. ముందు పర్యాటక శాఖ మంత్రిగా నీ బాధ్యత నువ్వు తెలుసుకో. పర్యాటక శాఖ మంత్రి అంటే నువ్వు పర్యటన చేయడం కాదు.. పర్యాటక శాఖని ఎలా డెవలప్ చేయాలో, అభివృద్ధి చేయాలో చూసుకో!

నువ్వు ఇన్ని రోజులు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ ని, నన్ను నోటికొచ్చినట్టు వాగినా కూడా నేను ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంటే అందుకు ఓకే ఒక్క కారణం.. నీ నోటికి మున్సిపాలిటీ కుప్ప తొట్టికి పెద్ద తేడా లేదు. చూస్తూ చూస్తూ ఎవ్వరూ కూడా మున్సిపాలిటీ కుప్పతొట్టి జోలికి వెళ్ళరు. అదే నిజం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పర్యాటక శాఖని ఎలా అభివృద్ధి చేయాలో నేర్చుకో..!” అంటూ ఘాటుగా స్పందించారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus