నాగ‌బాబు కామెంట్స్‌.. షాక్‌లో అవినాష్ ఫ్యాన్స్..?

  • November 26, 2020 / 02:46 PM IST

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4.. ఓరోజు గ‌రం గ‌రంగా, మ‌రోరోజు చ‌ప్ప‌చ‌ప్ప‌గా, అప్పుడ‌ప్పుడు హాట్ హాట్‌గా సాగుతోంది. ఎలాగైతే ఏం ప‌డుతూ లేస్తూ సాగుతున్న ఈ నాల్గొవ సీజ‌న్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. హౌస్‌లో ప్ర‌స్తుతం ఏడుగురు కంటెస్టెంట్లు మాత్ర‌మే ఉండ‌గా, ఈ వారం ఎలిమినేష‌న్స్‌లో అఖిల్, అవినాష్, అరియానా, మోనాల్‌లు ఉన్నారు. అయితే నామినేట్ అయిన స‌భ్యుల‌కు ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ రూపంలో బిగ్‌బాస్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడు.

ఈ నేప‌ధ్యంలో అనూహ్యంగ్ ల‌క్ క‌లిసి రావ‌డంతో డేంజ‌ర్ జోన్‌లో ఉన్న‌ అవినాష్ ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వ్యాలిడిటి రెండు వారాలు ఉంటుంద‌ని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో అవినాష్ ఈ రెండు వారాల్లో ఎప్పుడైన ఎవిక్ష‌న్ పాస్‌ను ఉప‌యోగించుకుని నామినేష‌న్ నుండి సేవ్ అవ్వొచ్చు. దీంతో అప్ప‌టికే ఢీలా ప‌డ్డ అవినాష్ జోష్‌లోకి రావ‌డమే కాకుండా టాప్ ఫైవ్‌లో దాదాపు చోటు ఖాయం చేసుకున్నాడు.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. అవినాష్ కోసం బ‌య‌ట‌ జ‌బ‌ర్ధ‌స్త్ గ్యాంగ్ రంగంలోకి దిగిన సంగ‌తి తెలిసిందే. తొలుత హౌస్‌లో మంచి ఎంట‌ర్‌టైన‌ర్‌గా పేరు తెచ్చుకున్న అవినాష్, రాను రాను సింప‌థీ గేమ్ ఆడుతూ వ్య‌తిరేక‌త‌ను పెంచుకున్నాడు. తాజా నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా మోనాల్ పై అవినాష్ విరుచుకుప‌డిన తీరు అత‌డి పై మ‌రింత వ్యతిరేక‌త‌ను తెచ్చిపెట్టింది. దీంతో త‌న స్నేహితుడిని కాపాడేందుకు గెట‌ప్ శ్రీను, ఆటో రాంప్ర‌సాద్‌ల‌తో పాలు ప‌లువురు జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడియ‌న్లు రంగంలోకి దిగి అవినాష్‌కు ఓటేయాల‌ని పిలుపునిచ్చారు. ‌

అయితే జ‌బ‌ర్ధ‌స్త్ నుండి త‌ప్పుకున్న మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు తాజాగా చేసిన వ్యాఖ్య‌లు అవినాష్ ఫ్యాన్స్‌కు షాకిచ్చేలా ఉన్నాయి. బిగ్‌బాస్ హౌస్‌లో త‌న మ‌ద్దత్తు అవినాష్ అండ్ అభిజిత్‌ల‌కే అని చెప్పిన నాగ‌బాబు, తొలి ప్రాధాన్య‌త మాత్రం అభిజిత్‌కే అనేలా కామెంట్స్ చేశారు. అవినాష్‌కు స‌పోర్ట్ చేయాల‌ని చెబుతూనే, భావోద్వేగానికి లోనే ఈమ‌ధ్య కొన్ని మిస్టేక్స్ చేశాడ‌ని, అభిజిత్ మాత్రం మొద‌టి నుండి చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఆడుతున్నాడ‌ని, అత‌ని వ్య‌క్తిత్వం త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని, వ్య‌క్తిగ‌తంగా అవినాష్‌కు స‌పోర్ట్ చేయాల‌ని అనిపిస్తున్నా ఎందుకో మ‌న‌సు మాత్రం అభిజిత్ పైనే ఉంద‌న్నాడు. అయితే చివ‌రిగా మాత్రం ఇద్ద‌రికీ ఓట్లు వేసి ఫైన‌ల్స్ వ‌రకు తీసుకురావ‌ల‌ని త‌న అభిమానుల‌ను కోరాడు మెగా బ్ర‌ద‌ర్.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus