Naga Babu: భార్య వార్నింగ్ ఇచ్చింది.. నాగబాబు కామెంట్స్ వైరల్..?

  • April 14, 2021 / 02:19 PM IST

2020 సంవత్సరంలో మెగాబ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వివాహాన్ని ఘనంగా జరిపించారు. ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది వరుణ్ తేజ్ పెళ్లి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే నాగబాబుకు కొన్నిరోజుల క్రితం ఒక నెటిజన్ రెండో పెళ్లి చేసుకోమని సూచించగా “మీకు ఓకే అంటే నాకు ఓకే” అంటూ బదులిచ్చిన సంగతి తెలిసిందే. నాగబాబు చేసిన కామెంట్ పై నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోల్ చేశారు.

అయితే తాజాగా నాగబాబును ఒక నెటిజన్ “మీరు రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదు సార్..?” అని ప్రశ్నించగా నాగబాబు ఆ ప్రశ్నకు సమాధానంగా మా ఆవిడ రెండో పెళ్లికి యాక్సెప్ట్ చేయలేదని తెలిపారు. రెండో పెళ్లి ఆలోచన వచ్చినా పీక కోస్తానని భార్య తనకు వార్నింగ్ ఇచ్చిందని నాగబాబు అన్నారు. భార్య అంత ప్రేమగా రెండో పెళ్లి గురించి చెప్పిన తర్వాత తాను మళ్లీ రెండో పెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తానని నాగబాబు పేర్కొన్నారు.

నెటిజన్లు ట్రోల్ చేసేందుకు అవకాశం ఇవ్వకుండా నాగబాబు రెండో పెళ్లికి సంబంధించి కామెంట్లు చేయడం గమనార్హం. మరోవైపు నాగబాబు మళ్లీ బుల్లితెరపై కనిపిస్తున్నారు. జీతెలుగులో ఉగాది పండుగ కానుకగా ప్రసారమైన ఈవెంట్ కు నాగబాబు, నిహారిక హాజరయ్యారు. మరోవైపు నాగబాబు సినిమా ఆఫర్లతో బిజీ అవుతున్నారు, ఛత్రపతి రీమేక్ తో నాగబాబు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. నిర్మాతగా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో సినిమాల నిర్మాణానికి దూరంగా ఉన్న నాగబాబు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలను ఎంపిక చేసుకుంటున్నారు.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus