గోవాలో విహరిస్తున్న టాలీవుడ్ ప్రేమ పక్షులు

  • November 23, 2016 / 12:37 PM IST

టాలీవుడ్ ప్రేమ పక్షులు సమంత, నాగ చైతన్యలు ప్రేమ యాత్రలో ఉన్నారు. ఇరు కుటుంబాలు తమ ప్రేమకు అంగీకారం తెలపడంతో సంతోషంగా విహరిస్తున్నారు. చైతూ నేడు(బుధవారం) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ ఇయర్ బర్తడే ని సూపర్ గా ఎంజాయ్ చేయాలనీ నాగ చైతన్య తన ప్రియురాలు సమంతతో కలిసి రెండు రోజులు ముందుగానే గోవాకి వెళ్లారు. అక్కడి బీచ్ లో సేద తీరుతున్నారు.

అలా ఇద్దరు సరదాగా గడుపుతున్న ఫోటో ని సమంత నిన్న తన ఇన్ స్ట్రా గ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ముసిముసి నవ్వులు చిందిస్తున్న ఈ ఫోటో అక్కినేని, సమంత అభిమానులతో పాటు నెటిజనులు తెగ నచ్చేసింది. గోవాలో విహరిస్తున్న ఫోటోలు మరిన్ని షేర్ చేయమని వారు సమంత ను కోరారు. నాగ చైతన్య తమ్ముడు అఖిల్ కి శ్రీయ భూపాల్ తో నిశ్చితార్ధం వచ్చే నెల జరగనుంది. వారిద్దరి పెళ్లి అయిన వెంటనే చైతూ పెళ్లి పనులు మొదలు కానున్నాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus