Naga Chaitanya,Sobhita: శోభిత- నాగ చైతన్య ల డేటింగ్ నిజమేనా.. ?
March 29, 2023 / 12:42 PM IST
|Follow Us
2021 చివర్లో సమంత- నాగ చైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ‘ఇద్దరి భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతో విడాకులు తీసుకున్నాం.. ఇప్పుడు తను హ్యాపీ, నేను హ్యాపీ’ అంటూ చాలా కూల్ గా ఓసారి స్పందించి వదిలేశాడు నాగ చైతన్య. అయితే మరోపక్క నాగ చైతన్య.. హీరోయిన్ శోభిత ధూళిపాళతో డేటింగ్లో ఉన్నాడని త్వరలోనే ఆమెను రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఓసారి శోభిత ‘మిడిల్ ఫింగర్’ చూపించిన వీడియోను షేర్ చేసి ఆ వార్తలన్నీ అబద్ధం అన్నట్టు రియాక్షన్ ఇచ్చింది.
ఇక చైతన్య కూడా తమ మధ్యలో ఏమీ లేదని చెప్పుకొచ్చాడు. తర్వాత ఈ వీరి వ్యవహారాన్ని అంతా మర్చిపోయారు. కానీ ఇప్పుడు ఓ చెఫ్ వల్ల వీరి మేటర్ మరోసారి చర్చనీయాంశం అయ్యింది. లండన్ లో ఉన్న ఓ రెస్టారెంట్ లో చైతన్య – శోభిత కలిసి కనిపించారు. ఆ హోటేల్లోని చెఫ్ నాగ చైతన్యతో ఓ ఫోటో దిగి.. దానిని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఈ ఫొటోలో వెనుక శోభిత కూడా కనిపించింది. దీంతో నాగ చైతన్య(Naga Chaitanya) – శోభిత నిజంగానే డేటింగ్లో ఉన్నారు అంటూ వార్తలు మొదలయ్యాయి. అడివి శేష్ హీరోగా నటించిన ‘గూఢచారి’ సినిమా షూటింగ్ చాలా వరకు అన్నపూర్ణ స్టూడియోస్ లోనే జరిగింది.పైగా ఆ సినిమాలో చైతన్య కజిన్ సుప్రియ కూడా నటించింది. అందుకే చైతన్య – శోభిత ల మధ్య ఫ్రెండ్ షిప్ ఏర్పడినట్టు స్పష్టమవుతుంది.