పెళ్లి తర్వాత మనసులోని మాట చెప్పిన నాగచైతన్య!

  • December 16, 2017 / 10:44 AM IST

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రియురాలు సమంతని పెళ్లి చేసుకున్నతర్వాత వెంటనే సినిమా షూటింగ్ కి వచ్చారు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి మూవీ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న చైతూ ఓ షాప్ ఓపెనింగ్ చేయడానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగతమైన, వృత్తిపరమైన అనేక సంగతులను వెల్లడించారు. ముఖ్యంగా పెళ్లితర్వాత తన లైఫ్ గురించి వివరించారు. ఇంతకుముందు లైఫ్‌తో పోల్చుకుంటే మ్యారేజ్ లైఫ్ చాలా బాగుందని చెప్పారు. “సమంతతో లైఫ్ చాలా బాగుంది. ఇప్పుడిప్పుడే మ్యారేజ్ లైఫ్‌ కి అలవాటుపడుతున్నాను” అని చైతూ అన్నారు. రీసెంట్ గా సమంతతో కలిసి నాగచైతన్య హనీమూన్ కి వెళ్లి వచ్చారు. ఆ కారణంగానే అఖిల్ నటించిన హలో చిత్ర ఆడియో ఆవిష్కరణకు రాలేకపోయారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి వారిద్దరూ వీడియో సందేశాన్ని పంపారు. ప్రస్తుతం సమంత “రంగస్థలం”, “మహానటి” చిత్రాల్లో నటిస్తున్నారు.  అలాగే  క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరపడానికి సిద్ధమయ్యారు. క్రిస్మస్ సెలబ్రేషన్‌కు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. పెళ్లి తర్వాత సమంత, నాగచైతన్యలు కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. అయితే అందులో హీరో హీరోయిన్స్ గా కాదు.. సమంత లీడ్ రోల్ పోషిస్తుండగా.. చైతూ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ మూవీ వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus