Naga Chaitanya: డ్యూయల్ రోల్ లో నటిస్తున్న చైతన్య.. కానీ?
July 18, 2022 / 04:46 PM IST
|Follow Us
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నాగచైతన్యకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. మరో మూడు రోజుల్లో చైతన్య నటించిన థాంక్యూ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమాపై ఆశించిన స్థాయిలో అంచనాలు అయితే ఏర్పడలేదు. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. సర్కారు వారి పాట సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న పరశురామ్ డైరెక్షన్ లో నాగచైతన్య ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా కథకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుండటం గమనార్హం. ఈ సినిమాలో చైతన్య తండ్రి పాత్రలో కొడుకు పాత్రలో కనిపిస్తాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రేమకు కూడా బాగానే ప్రాధాన్యత ఉంటుందని సమాచారం అందుతోంది. యూత్ ను ఆకట్టుకునేలా సినిమాలను తెరకెక్కించే దర్శకునిగా పేరు ఉన్న పరశురామ్ తర్వాత సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.
ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల రేంజ్ లో నాగచైతన్య పారితోషికం తీసుకుంటున్నారు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే చైతన్య పారితోషికం పెరిగే ఛాన్స్ ఉంది. అక్కినేని ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. సినిమాసినిమాకు చైతన్య రేంజ్ పెరుగుతుండగా థాంక్యూ సినిమాతో చైతన్య కోరుకున్న సక్సెస్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది.
నాగచైతన్య తర్వాత ప్రాజెక్ట్ లపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో చైతన్య నటిస్తే ఆయన కెరీర్ పుంజుకుంటుందని చెప్పవచ్చు. తండ్రి పాత్రను చైతన్య ఎంచుకున్నారంటే ఒక విధంగా ఈ రోల్ రిస్కీ రోల్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.