చైతూ రెమ్యునరేష్ పెంచాడటగా..!

  • October 19, 2016 / 09:38 AM IST

నాగ చైతన్య ప్రస్తుతం హిట్ కొట్టిన ఆనందంలో ఉన్నాడు. ‘దోచేయ్’తో వచ్చిన విమర్శలకు ‘ప్రేమమ్’తో సమాధానమిచ్చాడు ఈ అక్కినేని హీరో. రీమేక్ తో హిట్ కొట్టడం మామూలు విషయం కాదు. అదీ ‘ప్రేమమ్’ లాంటి మ్యాజికల్ మూవీని రీమేక్ చేయడం అంటే పెద్ద సాహసమే. అలాంటి సాహసం సక్సెస్ ఇచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. పాత్రానుసారం తన రూపు రేఖలు సైతం మార్చుకుని ప్రశంసలందుకున్న చైతూ తన రెమ్యునరేషన్ పెంచాడని టాలీవుడ్ గుసగుసలు.

నాగచైతన్య ఇప్పుడు ఓ సినిమాకి సంతకం చేయాలంటే అక్షరాలా మూడుకోట్ల మొత్తం ముట్టాల్సిందేనట. ప్రేమమ్ సినిమా 20 కోట్లు మార్క్ చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే దీని ఫలితంగా చైతూ ఈ నిర్ణయం తీసుకున్నాడనడం నిందే అవుతుంది. ‘ప్రేమమ్’ సినిమాకి ముందే ఈ నిర్ణయానికి వచ్చాడట. 20 కోట్ల రేంజ్ లో కలెక్షన్లు రాబడుతుంటే 3 కోట్లు పెద్ద లెక్కెం కాదని నిర్మాతలు కూడా సుముఖంగా ఉన్నారట. ప్రస్తుతం మూడు కోట్ల పారితోషికం అందుకునే యువ హీరోలలో నాని, శర్వానంద్, వరుణ్ తేజ్ వంటి వారుండగా ఇప్పుడు చైతూ కూడా వారి సరసన చేరాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus