నాగచైతన్య కస్టడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నటువంటి ఈయన తన వృత్తిపరమైన జీవితం గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడుతూ సమంతతో విడాకులు తీసుకోవడానికి గల కారణాలను తెలియజేశారు. ఇలా సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత ఈయన పూర్తిగా తన దృష్టి మొత్తం సినిమాల పైన పెట్టారు.
ఈ క్రమంలోనే కస్టడీ సినిమా ప్రమోషన్లలో పెద్ద ఎత్తున సమంత పేరును నాగచైతన్య ఉపయోగిస్తూ ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఇలా సమంత గురించి మాట్లాడుతూ ఈయన సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నారు. ఇదివరకే తన విడాకులకు గల కారణాలను తెలియజేసిన నాగచైతన్య మరోసారి విడాకుల గురించి కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ నేను సమంత చట్టపరంగా విడాకులు తీసుకొని రెండు సంవత్సరాలు అయింది.
ఇంకా మా విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా విడాకుల వార్తలకు పులి స్టాప్ పెట్టండి అని తెలిపారు. ఇకపై అయినా ఈ వార్తలు ఆగుతాయని అనుకుంటున్నానని తెలిపారు. తన సినీ కెరియర్ గురించి మాట్లాడిన తనకు బాధ ఉండదని వ్యక్తిగత జీవితం గురించి ఇలా లేనిపోని వార్తలు రాయడం బాధగా ఉందని తెలిపారు.
ఇక సమంత గురించి మాట్లాడుతూ సమంత (Naga Chaitanya) నా నుంచి విడాకులు తీసుకున్నప్పటికీ తనంటే నాకు గౌరవమేనని సమంతతో గడిపిన ఆదశ అంటే ఇప్పటికీ గౌరవమేనని ఈ సందర్భంగా నాగచైతన్య సమంత గురించి తెలియజేయడంతో పలువురు నాగచైతన్య వ్యాఖ్యలపై స్పందిస్తూ…నాగచైతన్యకు విడాకులు తీసుకున్న తర్వాత సమంత పై చాలా ప్రేమ పెరిగిందని అందుకే సమంత గురించి ఇంత గొప్పగా చెబుతున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?