Love Story Movie: తమ్ముడి సినిమానే కాదు… అన్న సినిమాకూ రీషూట్లు!
September 1, 2021 / 02:34 PM IST
|Follow Us
పర్ఫెక్షనిస్ట్లతో ఓ సమస్య ఉంటుంది. కాస్త సమయం దొరికితే… చేసిన పనిలో ఇంకొన్ని మార్పులు చేసుకుంటూ ఉంటారు. ఇదే దర్శకులు విషయానికొస్తే రీషూట్లు పెట్టుకుంటారు. లేదంటే ఎడిట్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. టాలీవుడ్లో పర్ఫెక్షనిజం చూపించే దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. తాజాగా ఆన ‘లవ్ స్టోరీ’ అనే సినిమా తెరకెక్కించారు. కరోనా పరిస్థితుల కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో ఆయన రీషూట్లు మొదలుపెట్టారని తెలుస్తోంది.
మొన్నామధ్య సినిమాను మరోసారి ఎడిట్ టేబుల్ దగ్గరకు తీసుకొచ్చారనే వార్తలు వినిపించాయి. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండటంతో మరోసారి కత్తెరకు పని చెప్పారని అన్నారు. అయితే దీనిపై చిత్రబృందం అధికారికంగా స్పందించలేదు. తాజాగా రీషూట్లు అంటూ పుకార్లు మొదలయ్యాయి. సినిమాలో కొన్ని సీన్స్ విషయంలో శేఖర్ కమ్ముల అండ్ టీమ్ అసంతృప్తి వ్యక్తం చేసిందని, అందుకే మారుస్తున్నారని టాక్. నిజానికి ఈ నెల 10న సినిమా విడుదల కావాల్సి ఉంది.
దీనిపై అధికారిక సమాచారం కూడా ఉంది. అయితే సినిమాను వాయిదా వేస్తున్నారనే టాక్ కూడా ఉంది. వివిధ కారణాల రీత్యా వాయిదా అంటున్నారు. త్వరలో ఈ విషయమూ అఫీషియల్‌గా చెబుతారేమో చూడాలి. అయితే అక్కినేని కుర్రాళ్ల రెండు సినిమాలు ఇలా వరుసగా రీషూట్లు జరుపుకోవడం ఒకింత ఆందోళన కలిగించే సమాచారం.