Naga Chaitanya: ‘బంగార్రాజు’ మూవీ ప్రమోషన్లలో ఆసక్తికర విషయాలు తెలిపిన నాగ చైతన్య..!
January 12, 2022 / 07:46 PM IST
|Follow Us
అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్య కాంబినేషన్లో తెరకెక్కిన ‘బంగార్రాజు’ చిత్రం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. రమ్యకృష్ణ, కృతి శెట్టి లతో సహా ఇంకో 6 మంది హీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్’, ‘జీ స్టూడియోస్’ సంస్థలు కలిసి నిర్మించాయి.’సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రాన్ని తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు.కాగా ప్రమోషన్లలో భాగంగా హీరో నాగ చైతన్య ఈ చిత్రం గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చారు.
ప్ర. కొత్తగా కనిపిస్తున్నారు. ఈ లుక్ థాంక్యూ కోసమా?
జ.లేదు ఇది క్యాజువల్ లుక్ మాత్రమే. ‘థాంక్యూ’ మూవీ షూటింగ్ 10 రోజుల తర్వాత ఉంది. అందుకోసం వేరేగా ప్రిపేర్ అవ్వాలి.
ప్ర.’మనం’ తర్వాత మళ్ళీ నాగార్జున గారితో కలిసి ‘బంగార్రాజు’ పని చేస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ నాగార్జున గారితో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎలా అనిపించింది?
జ.నాన్న గారితో, తాతయ్య గారితో కలిసి మొదటిసారి పనిచేసినప్పుడు కాస్త భయంగా అనిపించింది. కానీ ‘బంగార్రాజు’ కి అలా అనిపించలేదు. ఫుల్ ఫ్రీడమ్ తో ఈ మూవీ చేశాను.
ప్ర. ‘సోగ్గాడే చిన్ని నాయన’ అనగానే నాగార్జున గారే అందరికీ స్ట్రైక్ అవుతారు? ఇందులో మీరు చిన బంగార్రాజు కదా? ఈ పాత్ర కోసం మీరు ఎలాంటి హోమ్ వర్క్ చేశారు?
జ. నిజమే అందుకే… షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు నాన్నని,దర్శకుడు కళ్యాణ్‌ను చాలా డౌట్స్ అడిగాను. నా కెరీర్లో నేను చేసిన మొదటి సీక్వెల్ ఇది. ‘బంగార్రాజు’ రోల్ కి న్యాయం చెయ్యాలని ‘సోగ్గాడే’ మూవీని చాలా సార్లు చూశాను. ఆ తర్వాతే షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీ అయ్యాను.
ప్ర.ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
జ. ‘బంగార్రాజు’ పోలికలతో పుట్టినట్టు ఉంటుంది నా పాత్ర. ఆయన కంటే ఎక్కువ అల్లరి చేస్తుంటాను, నన్ను కంట్రోల్ లో పెట్టడానికి తాతగారు మళ్ళీ భూమ్మీదకి వస్తారు. అలాగే గుడికి సంబంధించి ఓ కాన్ఫ్లిక్ట్ కూడా ఉంటుంది.
ప్ర.చిన బంగార్రాజు తండ్రి పాత్ర ఏమవుతుంది?
జ. ఆ పాత్ర ఉంటుంది. రాము పాత్ర అమెరికాలో ఉన్నట్టు చూపిస్తారు. ఎక్కువ కనిపించరు కానీ చిన బంగార్రాజుతో ఫోన్లో మాట్లాడుతున్నట్టు ఆ పాత్ర ఉంటుంది.
ప్ర. ఈ మూవీలో నాగార్జున గారి పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందా? మీ పాత్రకి ఎక్కవుగా ప్రాధాన్యత ఉంటుందా?
జ.నా పాత్ర, నాన్న పాత్ర సమానంగానే ఉంటాయి. నాన్నది కానీ నాది కానీ గెస్ట్ రోల్ ఏమీ కాదు. అయితే కథ మొత్తం నాన్నగారు, రమ్యకృష్ణ గారి పాత్రల వల్లే జరుగుతుంటుంది.
ప్ర. ఈ సినిమాలో 7 మంది హీరోయిన్లు ఉన్నారు? కథని బట్టే పెట్టారా.. లేక గ్లామర్ ను యాడ్ చేయాలని పెట్టారా?
జ.సినిమాలో కృతి శెట్టినే మెయిన్ హీరోయిన్.మిగిలిన హీరోయిన్లు పాటల కోసం అలాగే బంగార్రాజు స్వర్గంలో ఉన్నప్పుడు అక్కడ దేవకన్యలు కనిపించాలి కాబట్టి స్క్రిప్ట్ ప్రకారమే వెళ్ళాం.అలాగే ఫెస్టివెల్ మూడ్ కి అది అదనపు ఆకర్షణ అయ్యింది.
ప్ర. కృతి శెట్టికి మీకు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది?
జ. నాకు కృతి శెట్టికి మంచి సీన్స్ ఉంటాయి.అవి అందరినీ ఎంటర్టైన్ చేస్తాయి.
ప్ర.’బంగార్రాజు’ సీక్వెల్ ఎందుకు ఇంత లేట్ అయ్యింది?
జ.నిజానికి 2 ఏళ్ళ క్రితం షూటింగ్ స్టార్ట్ అవ్వాలి. కానీ అనుకోకుండా కోవిడ్ వచ్చింది. తర్వాత నాన్న నేను మా పెండింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసే పనిలో పడడం…. మళ్ళీ సెకండ్ వేవ్ రావడంతో మరింత డిలే అయ్యింది. అయితే ఆగష్ట్ లో ఈ మూవీని కచ్చితంగా సంక్రాంతి ఫెస్టివల్ కు ఇవ్వాలని ఫిక్స్ అయ్యి ముందడుగు వేసాం.చాలా వరకు ‘బంగార్రాజు’ ను ఒకే షెడ్యూల్లో పూర్తి చేసాం. నిజంగా ఇది పండగ లాంటి సినిమా..!
ప్ర.’బంగార్రాజు’ ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసారు?
జ. 90 రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేశాం.
ప్ర.ఇప్పుడు ఆంధ్రలో టికెట్ రేట్ల ఇష్యు నడుస్తుంది. మీ మూవీ పై ఆ ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటున్నారా ?
జ.ఈ టికెట్ రేట్ల ఇష్యు అనేది నాన్నతో షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందే డిస్కస్ చేశాను. ఏప్రిల్‌లో జీవో వచ్చింది. కాబట్టి షూటింగ్ మొదలయ్యే ముందే టికెట్ రేట్లకు తగ్గట్ట బడ్జెట్ ఫిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు టికెట్ రేట్స్ హైక్ వస్తే .. మాకు బోనస్ అవుతుంది.
ప్ర.’బంగార్రాజు’ విషయంలో బడ్జెట్ కి తగినట్టు చేశానన్నారు ఓకె.. మరి ‘థాంక్యూ’ మూవీ బడ్జెట్ కు ఈ టికెట్ రేట్లు సరిపోతాయా?
జ. ‘థాంక్యూ’ మూవీ నిర్మాత దిల్ రాజు గారు.. ఆ మూవీ విషయంలో ఆయనే డెసిషన్ తీసుకుంటారు. నేను హీరోని మాత్రమే. పరిస్థితిని బట్టి ముందుకు అడుగు వెయ్యాలి.
ప్ర.’బంగార్రాజు’ విషయంలో తాతగారి(అక్కినేని నాగేశ్వర రావు గారి) రిఫరెన్స్ లు ఏమైనా తీసుకున్నారా?
జ.ఎస్.. ‘బంగార్రాజు’ పాత్ర కోసం తాతగారి వస్తువుల్ని నాన్న గారు వాడారు… ఆయన ఏమైతే వాడారో నేను కూడా వాటిని వాడేసాను.(నవ్వుతు)
ప్ర.ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
జ.రానా, అఖిల్. వాళ్లతోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను.మా నాన్న కూడా నాకు మంచి ఫ్రెండే.
ప్ర. ‘బంగార్రాజు’ లో రమ్యకృష్ణ గారితో మీకు కాంబినేషనల్ సీన్స్ ఉంటాయా?
జ.ఆవిడతో కాంబినేషనల్ సీన్స్ ఉన్నాయి. ‘శైలజారెడ్డి అల్లుడు’ లో ఆమెతో కలిసి ఫుల్ లెంగ్త్ నటించాను. ‘బంగార్రాజు’ లో కూడా అలానే ఉంటుంది. సీనియర్స్ తో కలిసి నటిస్తుంటే చాలా నేర్చుకోవచ్చు. రమ్యకృష్ణ గారు కూడా సెట్స్ లో అందరితో సరదాగా ఉంటారు.
ప్ర.ఈ సంక్రాంతికి మీ ‘బంగార్రాజు’ తో పాటు మరికొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి? అవి మీ సినిమాకి పోటీ ఇస్తాయి అనుకుంటున్నారా?
జ. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏమీ ఉండదు. కంటెంట్ ఉంటే…ఆడియెన్స్‌కి కనెక్ట్ అయితే.. ఏ సినిమా అయినా బాగా ఆడుతుంది. ‘హీరో’, ‘రౌడీ బాయ్స్’ ఆ సినిమాల టీం సభ్యులకి ఆల్ ది బెస్ట్.
ప్ర.మీ నెక్స్ట్ ప్రాజెక్టులు ఏంటి?
జ.’థాంక్యూ’ కంప్లీట్ చెయ్యాలి. ఆ తర్వాత అమెజాన్ వారితో ఓ హార్రర్ వెబ్ సిరీస్ ఉంటుంది.
ప్ర. పరశురామ్ గారితో ఓ మూవీ అనౌన్స్ చేశారు.. అలాగే ‘నాంది’ ఫేమ్ విజయ్ కనకమేడల గారితో మూవీ కూడా ఉంటుంది అని విన్నాం?
జ.మహేష్ గారి మూవీ కంప్లీట్ అయ్యాక పరశురామ్ గారితో మూవీ ఉంటుంది. ఇక విజయ్ కనకమేడల గారితో ట్రావెల్ అవుతున్నాను. స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ కాలేదు. అది కంప్లీట్ అయితే వెంటనే ఓకె చేసేస్తా..!