నాగచైతన్య, చందూ కలయికలో మరో సినిమా

  • April 8, 2017 / 01:34 PM IST

యువసామ్రాట్ నాగచైతన్య కెరీర్ లో  ప్రేమమ్ మంచి హిట్ గా నిలిచింది. చందూ మొండేటి ఈ చిత్రాన్ని ఎంతో చక్కగా తెరకెక్కించారు. అతని ప్రతిభని గుర్తించిన నాగార్జున అభినందించి, అప్పుడే మరో సినిమా చేసే ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో చైతూ మళ్ళీ నటించనున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా చేస్తున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ జోడీగా నటుస్తున్న ఈ ఫిలిం ని జూన్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ రిలీజ్ కాకముందే  వారాహి చలన చిత్ర బ్యానర్లో చైతూ ఓ మూవీ పట్టాలెక్కించనున్నారు. ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా ఫిక్స్ అయింది. ఇక  దీని తర్వాత చందూ మొండేటి ప్రాజక్ట్ ఉంటుందని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రం వివరాలను అధికారికంగా త్వరలో వెల్లడించనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus