మన సినిమా ఇండస్ట్రీలో “కాంబినేషన్” అనే పదానికి విపరీతమైన వేల్యూ ఇస్తారు. అందుకే ఒకసారి హిట్ కొట్టిన హీరోయిన్స్ లేదా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ లో ఇమ్మీడియట్ గా వర్క్ చేయడానికి సుముఖత చూపుతుంటారు మన హీరోలు. ఇప్పుడు ఇదే ఫ్లోను ఫాలో అవుతానంటున్నాడు యువ కథానాయకుడు నాగశౌర్య. “ఛలో”తో సొంత బ్యానర్ లో సూపర్ హిట్ అందుకొన్న శౌర్యకు ఆ తర్వాత హ్యాట్రిక్ ఫ్లాప్ తప్పలేదు.
దాంతో కాస్త స్పీడ్ తగ్గించిన శౌర్య.. తన తదుపరి చిత్రంగా సుకుమార్ అసిస్టెంట్ దర్శకత్వంలో నటించడానికి రంగం సిద్ధం చేసుకొంటున్నాడు. అయితే.. ఈ చిత్రంలో హీరోయిన్ గా తనకు “ఛలో”తో మంచి హిట్ ఇచ్చిన రష్మికనే కావాలని అడుగుతున్నాడట. రష్మిక ప్రస్తుతం ఒక కన్నడ సినిమా మరియు రెండు తెలుగు సినిమాలతో బిజీగా ఉండడంతో.. ఎంత లేటైనా పర్లేదు ఆమే హీరోయిన్ గా కావాలని చెప్పేశాడట. మరి శౌర్య హిట్ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి హిట్ కొడతాడో లేదో చూడాలి.