నిన్న నర్తనశాల, నేడు మూగమనసులు, రేపు..??

  • September 23, 2019 / 01:01 PM IST

ఒక సినిమాకి టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సినిమాలో హీరోహీరోయిన్స్ గా ఎవర్ని తీసుకోవాలి, ఎలాంటి లొకేషన్స్ లో షూట్ చేయాలి అనే విషయాలకంటే సినిమాకి టైటిల్ ఏం పెట్టాలి అనే విషయం మీద ఎక్కువగా చర్చించుకొంటారు మన దర్శకనిర్మాతలు, కథానాయకులు. మరి అంతగా ఆలోచించి టైమ్ వేస్ట్ చేయడం ఎందుకు అనుకుంటున్నాడో లేక మరింకేదైనా కారణమో తెలియదు కానీ.. ఓల్డ్ క్లాసిక్ టైటిల్ మీద డిపెండ్ అయిపోతున్నాడు నాగశౌర్య.

తన మునుపటి చిత్రానికి “నర్తనశాల” అని ఒన్నాఫ్ ది క్లాసిక్ టైటిల్ పెట్టుకొన్న శౌర్య ఆ సినిమాతో హిట్టు కొట్టలేక చతికిలపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో తన తదుపరి చిత్రానికి “మూగ మనసులు” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సౌజన్య అనే యువ ప్రతిభాశాలి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే. సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు కానీ.. టైటిల్ మాత్రం ఫిక్స్ చేయించేశాడు శౌర్య. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్న శౌర్య.. ఈ మూడు చిత్రాలను 2020లోనే విడుదల చేయించాలని ప్లాన్ చేస్తున్నాడు.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus