చిరంజీవి బయోపిక్ ను… తీయాల్సిన అవసరమేముంది..?

  • March 9, 2019 / 04:42 PM IST

ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురి సినీ హీరో… హీరోయిన్లు, రాజకీయ నాయకుల పై బయోపిక్ లు వచ్చాయి. ఇంకా అనేకమంది క్రీడా కారులు, స్వాతంత్ర సమరయోధుల బయోపిక్ లు కూడా ముస్తాబవుతున్నాయి. బాలీవుడ్ లో ‘డర్టీ పిక్చర్’ ‘ఎం.ఎస్.ధోని’ ‘సంజు’. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే ‘మహానటి’ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ‘యాత్ర’ వంటి బయోపిక్ లు వచ్చాయి. ఈ క్రమంలో మెగాస్టార్ బయోపిక్ కూడా తీస్తే బాగుండు అని… మెగా అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

ఈ బయోపిక్ లో రాంచరణ్ ను… చిరు పాత్రలో చూడాలని వారు కోరుకుంటున్నారట. అయితే తాజాగా ఈ టాపిక్ పై మెగా బ్రదర్ నాగబాబు మరోసారి స్పందించారు… “అసలు మెగాస్టార్ బయోపిక్ లో జనాలను ఆకట్టుకునే మ్యాటర్ పెద్దగా ఏమీ లేదు. బయోపిక్ అంటే చాలా డ్రామా ఉండాలి.. అలాగే అప్స్ అండ్ డౌన్స్ కూడా చాలా ఉండాలి. అన్నయ్య బయోపిక్ అంతగా వర్కౌట్ అవ్వదు, ఆయన జీవితంలో జనాలను ఎక్కువగా ఎట్రాక్ట్ చేసే విషయాలు కూడా ఏమి లేవు. అయినా ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న మెగాస్టార్ బయోపిక్ తీయాలా…? మెగాస్టార్ బయోపిక్ తీయాలని నాకు లేదు అలాగే చరణ్ కి కూడా ఉండదని అనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు నాగబాబు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus