తమ సిద్ధాంతాలు వేర్వేరు అయినప్పటికీ.. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ చచ్చేవరకు తన సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను విడిచిపెట్టానని నటుడు నాగబాబు చెబుతున్నారు. బుధవారం ఇన్స్టాగ్రామ్ లో నెటిజన్లతో ముచ్చటించిన ఆయన.. తాజాగా మరోసారి రాజకీయాల గురించి స్పందించారు. రాజకీయాలపై తనకు ఆసక్తి పోయిందని అన్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ‘రాజకీయాలంటే ఆసక్తిలేనప్పుడు మీరు ప్రజలకు సాయం చేయగలరా..?’ అని ప్రశ్నించాడు. దానికి నాగబాబు.. ‘అంటే రాజకీయాల్లో ఉంటేనే ప్రజలకు సేవ చేయాలి. లేకుంటే చేయకూడదు.
అంతేగా.. అరెరే.. పెద్ద సమస్య వచ్చిందే.. ఈ విషయం తెలియక చాలా పొరపాటు చేశానే..!’ అంటూ జోక్ చేస్తూ.. ఆ తరువాత సిద్ధాంతాలు వేరైనా, తుదిశ్వాస వరకూ నా సోదరులతోనే ఉంటానని.. రాజకీయంగా కాకపోయినా.. కష్టాల్లో ఉన్నవారికి చేతనైనంత సాయం చేస్తానని అన్నారు. ఆ తరువాత మరో నెటిజన్.. ‘మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా ఉండాలంటే ఏం మారాలి’ అని ప్రశ్నించగా.. ‘మగాడి మైండ్ సెట్ మారాలంటూ’ నాగబాబు బదులిచ్చారు. ఆ తరువాత మరో నెటిజన్ అడిగిన దానికి.. ‘మంది ముందు మాట్లాడేవాడు పులి..
మంది వెనుక మాట్లాడేవాడు పిల్లి’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఒకప్పటితో పోలిస్తే ఈ మధ్యకాలంలో నాగబాబు కాస్త సైలెంట్ అయ్యారనే చెప్పాలి. తన తమ్ముడు పవన్ ని ఎవరైనా టార్గెట్ చేస్తే ఆయన అసలు ఊరుకునేవారు కాదు కానీ రీసెంట్ గా పోసాని ఇష్యూపై ఆయన పెద్దగా స్పందించలేదు. వెటకారంగా రెండు, మూడు మాటలు అనేసి ఊరుకున్నారు.