Nagarjuna: ‘తనకు తెలియకుండా ఎప్పుడు నటించానా?’ అని శ్రీకాంత్ షాక్ ఆయిన ఆ సినిమా ఏంటంటే..?
March 10, 2023 / 06:05 PM IST
|Follow Us
సినిమా ఇండస్ట్రీలో ఒకోసారి కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి.. దర్శక నిర్మాతలు కావాలనే బిజినెస్ గురించి చేస్తారో.. లేదా కామెడీగా చేస్తారో లేదో తెలియదు కానీ భలే గమ్మత్తైన సంఘటనలు సంచలనాలకు నాంది అవుతుంటాయి.. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేయడం అనేది సర్వ సాధారణమే.. ప్రాంతానికి తగ్గట్టు కథలో సోల్ మిస్ కాకుండా చిన్న చిన్న మార్పులతో రీమేక్ చేయగా సూపర్ హిట్స్ అయిన శాతమే ఎక్కువ..
అలా కాకుండా.. ఓ తెలుగు సినిమాని కన్నడలో రీమేక్ చేసి.. తెలుగు స్టార్ క్యామియో రోల్ చేసిన ఆ కన్నడ సినిమాని మళ్లీ తెలుగులో డబ్ చేస్తే ఎలా ఉంటుంది?.. తీరా రిలీజ్ విషయం తెలిసి ఆ స్టార్ ‘నాకు తెలియకుండా నేనెప్పుడు ఆ సినిమా చేశానబ్బా?’ అని షాక్ అయితే ఎలా ఉంటుంది?.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. శ్రీకాంత్ తెలుగులో హీరోగా మంచి ఫామ్లో ఉండగా.. తను నటించిన ‘అమెరికా అల్లుడు’ అనే సినిమా త్వరలో రిలీజ్ కానుందంటూ వార్తలు వచ్చే సరికి షాక్ అయ్యాడు..
ఆ సినిమా ఎప్పుడు చేశానా అని కంగారు పడ్డాడు.. అప్పుడు అది తను చేసిన కన్నడ డబ్బింగ్ సినిమా అని తెలిసింది.. ఆ మూవీ పేరు ‘ఉగాది’ (2007).. శ్రీకాంత్ కర్ణాటకలోని గంగావతిలో పుట్టి పెరిగినా స్టార్ అయింది మాత్రం తెలుగులోనే.. అలాగే కన్నడంలోనూ నటించాడు.. కన్నడ స్టార్, శ్రీకాంత్ స్నేహితుడైన క్రేజీస్టార్ రవి చంద్రన్.. తాను హీరోగా నటిస్తున్న ‘ఉగాది’ చిత్రంలో ఓ కీలకపాత్ర చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేయడంతో శ్రీకాంత్ యాక్ట్ చేశాడు.
ఆ సినిమా నాగార్జున సూపర్ హిట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సంతోషం’ కి రీమేక్.. ఇక్కడ ప్రభుదేవా చేసిన సెకండ్ హీరో క్యారెక్టర్ అక్కడ శ్రీకాంత్ చేశాడు.. ఆ సినిమాని తెలుగులో శ్రీకాంత్ సినిమాగా చెలామణీ చేస్తూ అమ్మేసుకోవాలని ఓ డబ్బింగ్ ప్రొడ్యూసర్ మాస్టర్ ప్లాన్ వేశాడు.. ఈ విషయం తెలియగానే బయ్యర్లు మోసపోకూడదని శ్రీకాంత్ ‘అమెరికా అల్లుడు’ గురించి అసలు విషయం బయట పెట్టాడు.. మన సినిమాలను రీమేక్ చేసి, మళ్లీ డబ్ చేసి మన దగ్గర రిలీజ్ చేయడం అనేది అప్పటికేం మొదటిసారి కాకపోయినా ఒక హీరోని ఇన్వాల్వ్ చేయడం మాత్రం ఇదే మొదటిసారి..