ఎన్టీఆర్ బయోపిక్ లో అక్కినేని నాగార్జున

  • February 9, 2017 / 12:10 PM IST

మహానటుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను సినిమాగా రూపొందిస్తానని నటసింహ బాలకృష్ణ ప్రకటించడంతో ఈ వార్త ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది. ఎన్టీఆర్ గా తానే నటిస్తాననడం నందమూరి అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రంలో మహానటుడు యవ్వనం నుంచి సీఎం గా ఎదిగిన వరకు చూపించాల్సి ఉంటుంది. ముఖ్యం గా టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా ఉన్నా దశను జనరంజకంగా తీయాలి. ఈ దశలో ఎన్టీఆర్ కి గట్టి పోటీనిచ్చిన అక్కినేని నాగేశ్వరరావు గురించి కొంత చెప్పాలి.. చూపించాలి. సో ఈ పాత్రను ఏఎన్నార్ నట వారసుడు అక్కినేని నాగార్జున పోషిస్తే బాగుంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

అందుకు నాగ్ ఒప్పుకుంటే చిత్రం రేంజ్ పెరిగిపోతుందని చెబుతున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీని  విష్ణు ఇందూరి నిర్మించనున్నారు. బాలకృష్ణ 101 చిత్రం గా ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ఉండవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో నటించే ఆర్టిస్టులు, టెక్నీషియన్ల గురించి బాలయ్య త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus