నాగార్జున ఛాలెంజ్ ని సమంత స్వీకరిస్తుందా?

  • August 3, 2018 / 02:05 PM IST

మామ కోడలు అనే అనుబంధానికి నాగార్జున, సమంతలు కొత్త అర్ధాన్ని ఇస్తున్నారు. భయం, భక్తి అనే మాటలను వీరిద్దరూ పక్కన పెట్టి .. గౌరవం, అభిమానం అనే ఎమోషన్ తో అనుబంధాన్ని బలంగా చేసుకుంటున్నారు. స్నేహితుల్లా సాగుతున్నారు. అదే ఫ్రెండ్ షిప్ తోనే నాగార్జున సమంతకు కొత్త ఛాలెంజ్ ని విసిరారు.  దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకొని ఇగ్నైటింగ్స్ మైండ్స్, వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థలు తెలంగాణ ‘హరితహారం’లో భాగంగా  గ్రీన్ చాలెంజ్ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా కవిత.. సినీ స్టార్స్ ని ఇందులో భాగం చేశారు.

సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నప్పటికీ ఉత్సాహంగా మహేష్ బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ తదితరులు మొక్కలు నాటారు. రీసెంట్ గా మొక్కలు నాటిన అక్కినేని నాగార్జున తన కోడలు అక్కినేని సమంత,  కన్నడ హీరో శివ రాజ్ కుమార్ , బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్అ కరణ్ జోహార్, తమిళ స్టార్ హీరోస్ అయిన ధనుష్, కార్తీలకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. మరి మామ విసిరిన ఛాలెంజ్ ని కోడలు స్వీకరిస్తుందా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సమంత యూ టర్న్ డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి సమంత సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. అలాగే భర్త నాగచైతన్య తో కలిసి మూవీ చేయడానికి సిద్ధమవుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus