Bigg Boss Telugu6: ‘బిగ్ బాస్ 6’ కి భారీ పారితోషికం అందుకుంటున్న నాగార్జున..!

  • September 3, 2022 / 06:45 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 6.. కి సర్వం సిద్ధమైంది. కంటెస్టెంట్లు ఎవరు అనే విషయం పై చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే క్లారిటీ రావాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. ప్రస్తుతానికైతే సింగర్‌ రెవంత్‌, మోడల్‌ రాజశేఖర్‌ పేర్లు కన్ఫామ్‌ అని తెలుస్తుంది.స్వయంగా వీళ్ళే ఆ విషయాన్ని తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల ద్వారా తెలియజేసారు.అటు తర్వాత డిలీట్‌ చేశారు కూడా.! ఇదిలా ఉండగా.. ‘బిగ్‌ బాస్‌’ సీజన్6ని కూడా నాగార్జునే హోస్ట్ చేయనున్నారు.

సీజన్ 3 నుండి ఆయనే హోస్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ కి ఆయనే పర్ఫెక్ట్ హోస్ట్ అని మేకర్స్ కూడా ఫిక్స్ అయ్యి ఆయన్నే కంటిన్యూ చేస్తున్నారు. నాగార్జున హోస్ట్ చేయడం వల్లనే ప్రీమియర్స్ కానీ ఫినాలే ఎపిసోడ్లు కానీ చాలా గ్రాండ్ గా చిత్రీకరిస్తున్నారు. టి.ఆర్.పి రేటింగ్లు కూడా అదిరిపోతున్నాయి. ‘బిగ్‌బాస్‌ షో’ ని హోస్ట్ చేస్తున్నందుకు గాను నాగార్జునకి సీజన్.. సీజన్ కు పారితోషికం పెంచుతూనే వస్తున్నారు మేకర్స్.

గత సీజన్లకు ఎలా ఉన్నా.. సీజన్‌ 6కు వచ్చేసరికి ఒక్కో ఎపిసోడ్‌ కు ఆయన రూ.55 లక్షలు రెమ్యూనరేషన్‌ అందుకుంటున్నారు అని తెలుస్తుంది. అంటే వీకెండ్లో వచ్చే రెండు ఎపిసోడ్లకు గాను నాగార్జున రూ.1.10 కోట్లు అందుకుంటున్నారన్న మాట. ఇక సీజన్ ముగిసేసరికి అంటే 15 వారాలకు గాను నాగార్జున రూ.16.50 కోట్ల వరకు పారితోషికం అందుకోబోతున్నట్టు స్పష్టమవుతుంది.

హిందీ బిగ్ బాస్ కొత్త సీజన్ కు సల్మాన్ ఖాన్ రూ.1000 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు అంటూ ప్రచారం జరిగింది. దాంతో పోలిస్తే ఇది ఎక్కువేమీ కాదు లెండి.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus