Nagarjuna: రియల్ బంగార్రాజు ఎవరో చెప్పేసిన ​నాగార్జున!

  • January 19, 2022 / 10:49 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జున బంగార్రాజు సినిమాతో సంక్రాంతి విన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. వీక్ డేస్ లో కూడా బంగార్రాజు సినిమాకు పరవాలేనిపించే స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. ఈ వీకెండ్ నాటికి బంగార్రాజు సినిమా అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే 80 శాతం కలెక్షన్లను సాధించిన బంగార్రాజు నిర్మాతగా నాగార్జునకు చెప్పుకోదగ్గ స్థాయిలో లాభాలను అందించిందని సమాచారం.

తాజాగా రాజమండ్రిలో బంగార్రాజు సినిమా ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ లో నాగ్ మాట్లాడుతూ అసలైన బంగార్రాజు అక్కినేని నాగేశ్వరరావు గారు అని చెప్పారు. నాన్న ఆశీస్సుల వల్లే ఈ సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకుందని నాగ్ వెల్లడించారు. నాన్న ఈ సంబరాన్ని చూస్తుంటారని ఇక్కడే ఎక్కడో ఉంటారని నాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనే ప్రేక్షకుల ఆదరాభిమానాలను మాకు ఇచ్చారని నాగ్ వెల్లడించారు.

బంగార్రాజు మూవీ రాజమండ్రిలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతోందని విన్నానని తాను అభిమానుల ప్రేమ గురించి మాట్లాడాలని ఇక్కడికే వచ్చానే తప్ప కలెక్షన్ల గురించి మాట్లాడటానికి రాలేదని నాగ్ అన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఏఎన్నార్ కళ్లు అని టాలీవుడ్ ఇండస్ట్రీ ఉన్నంత వరకు వాళ్లిద్దరినీ గుర్తుంచుకుంటామని నాగార్జున కామెంట్లు చేశారు. అభిమానుల ప్రేమ, అభిమానాలతో పోల్చి చూస్తే కలెక్షన్లు ఎంత అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు.

రిలీజ్ కు ముందే బంగార్రాజు సక్సెస్ సాధిస్తుందని చెప్పిన నాగార్జున బంగార్రాజు సక్సెస్ తో ఆ నమ్మకాన్ని నిజం చేసుకున్నారు. బంగార్రాజు సక్సెస్ తో నాగ్ తర్వాత సినిమాలకు కూడా రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. కృతిశెట్టి బంగార్రాజు సక్సెస్ తో గోల్డెన్ లెగ్ అని పిలిపించుకుంటున్నారు. బాహుబలి2 తర్వాత సరైన సక్సెస్ లేని రమ్యకృష్ణకు సైతం బంగార్రాజు సక్సెస్ కలిసొచ్చింది. నాగార్జున తరువాత సినిమా ది ఘోస్ట్ పేరుతో ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా ఈ ఏడాదే ఈ సినిమా విడుదల కానుంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus