Nagarjuna: ఫిట్ నెస్ సీక్రెట్లను బయటపెట్టిన నాగార్జున.. అవే ఇష్టమంటూ?
January 17, 2024 / 01:47 PM IST
|Follow Us
టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోలలో ఒకరైన అక్కినేని నాగార్జున నా సామిరంగ సినిమాతో హిట్ కొట్టారు. మూడు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రెండు రోజుల్లో భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న నా సామిరంగ ఫుల్ రన్ లో సులువుగానే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. బడ్జెట్ తక్కువే కావడంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.
అయితే వయస్సు పెరుగుతున్నా అక్కినేని నాగార్జున ఫిట్ గా కనిపిస్తూ ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. నేను డిన్నర్ చేస్తానని రైస్, సలాడ్స్, చికెన్, ఫిష్ అన్నీ తింటానని నాగార్జున కామెంట్లు చేశారు. నా సామిరంగ సినిమాలో తిన్న చేపల పులుసు యూనిట్ వాళ్లు వండారని చేపల పులుసు ఫ్రెష్ గా ఉందని చెప్పుకొచ్చారు. నేను వైట్ రైస్ తిననని బ్రౌన్ రైస్ తింటానని నాగార్జున కామెంట్లు చేశారు.
నెయ్యి, ఆకు కూరలు తింటానని నాకు నచ్చిన వంటకాలను తింటానని అదే సమయంలో వర్కౌట్లు మిస్ కానని ఆయన అన్నారు. తొక్కు పచ్చడి తింటానని కడుపు నిండా తింటానని నాగ్ పేర్కొన్నారు. తిన్న కేలరీలను కరిగించాలని నేను భావిస్తానని ఆయన అన్నారు. మెటబాలిజం హైలో ఉండేలా వర్కౌట్లు చేస్తే చాలని నాగ్ అన్నారు. రాత్రి సమయంలో పడుకునే ముందు కచ్చితంగా స్వీట్లు తింటానని నాగార్జున వెల్లడించారు. స్వీట్లు తినకపోతే తనకు నిద్రపట్టదనే అర్థం వచ్చేలా స్వీట్లు కచ్చితంగా ఉండాల్సిందేనని నాగ్ కామెంట్లు చేశారు.
నాగార్జున (Nagarjuna) మరోసారి సంక్రాంతి విజేతగా నిలవడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. నాగార్జున తన సినీ కెరీర్ లో ఎంతోమంది కొత్త దర్శకులకు ఛాన్స్ ఇవ్వడంతో పాటు ఆ దర్శకులు కెరీర్ పరంగా సక్సెస్ కావడానికి తన వంతు సహాయసహకారాలు అందించారు. నాగార్జున భవిష్యత్తు సినిమాలు సైతం భారీ హిట్లుగా నిలవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.