Bigg Boss 5 Telugu: మానస్ కి – సన్నీకి అన్యాయం జరిగిందా..?

  • October 3, 2021 / 09:36 AM IST

బిగ్ బాస్ హౌస్ లో 4వ వారం గెలవాలంటే తగ్గాల్సిందే టాస్క్ లో హౌస్ మేట్స్ జంటలుగా విడిపోయి టాస్క్ ని విజయవంతంగా పూర్తి చేశారు. ఇందులో మానస్ కళ్లుచెదిరేలా, అందరూ ఆశ్చర్యపోయేలా వెయిట్ తగ్గాడు. అంతేకాదు, తన టీమ్ మెంబర్ అయిన సన్నీని సైతం మోటివేట్ చేస్తూ తమ పెయిర్ గేలిచేలా చేశాడు. ఇక్కడి వరకూ కథ బాగానే ఉంది. శనివారం మాత్రం నాగార్జున వచ్చి ఓవర్ ఆల్ పెర్ఫామన్స్ వైజ్ గా ర్యాంక్స్ ఇస్తున్నాం అంటూ శ్రీరామ్ అండ్ హమీదాకి మొదటి ర్యాంక్ ని, అనీమాస్టర్ ఇంకా శ్వేత ఇద్దరికీ సెకండ్ ర్యాంక్ ని, సన్నీ ఇంకా మానస్ లకి మూడో ర్యాంక్ ని ఇచ్చారు. అసలు అది ఎక్కడి న్యాయం నాగార్జున గారూ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి అందరికంటే టాస్క్ లో కష్టపడింది మానస్ అండ్ సన్నీలు. ఫుడ్ వస్తున్నా ఎక్కడా కూడా టెంప్ట్ అవ్వకుండా నిగ్రహంగా ఉన్నారు. అందులోనూ వాళ్ల జోడీ టాప్ ప్లేస్ లో ఉంది. ఇక కెప్టెన్సీ కంటెండర్ గా ఒకరిని సెలక్ట్ చేస్కోమన్నప్పుడు కూడా అపోనెంట్ ని బట్టీ ఛూస్ చేస్కుందామని కాసేపు ఆగారు. దీనికోసం ర్యాంకింగ్ లో మూడో ప్లేస్ ఇవ్వడం అనేది అన్యాయమని అంటున్నారు బిగ్ బాస్ లవర్స్ అందరూ. ఎందుకంటే, ఈవారం అంతా పెర్ఫామన్స్ చూసినా కూడా సన్నీ బాగా ఎంటర్ టైన్ చేశాడు. అంతేకాదు, కెప్టెన్సీ టాస్క్ అప్పుడు కూడా సన్నీని హౌస్ మేట్స్ టార్గెట్ చేశారు.

శ్రీరామ్ అండ్ హమీదా ఇద్దరూ కూడా పెద్దగా పెర్ఫామ్ చేసింది ఎక్కడా కూడా కనిపించలేదు. కేవలం పాటలు పాడుతూ డ్యాన్స్ లు చేస్తూ కనిపించారు అంతే. ఈ లవ్ ట్రాక్ హైలెట్ గా అనిపించి మరీ ర్యాంకింగ్ లో టాప్ ఇవ్వడం అనేది ఎంతవరకూ కరెక్ట్ అనేది పాయింట్. ఈ ర్యాకింగ్స్ లో ఖచ్చితంగా మానస్ అండ్ సన్నీలకి అన్యాయం జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు అందరూ. అదీమేటర్.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus