Nagarjuna: నాగార్జున అభిమానుల కోరిక ఇదే.. కానీ?

  • June 13, 2022 / 12:10 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జున ఆరు పదుల వయస్సులో కూడా అద్భుతంగా నటిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు. వరుస పరాజయాలతో కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సమయంలో బంగార్రాజు సినిమాతో నాగ్ ఖాతాలో సక్సెస్ చేరింది. ఈ సినిమా ఫుల్ రన్ లో ఏకంగా 40 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం నాగార్జున ది ఘోస్ట్ సినిమాతో పాటు బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా నటిస్తున్నారు.

బ్రహ్మాస్త్ర తెలుగులో బ్రహ్మాస్తం పేరుతో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నాగార్జున ఖాతాలో ఈ సినిమాతో కొత్త రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో నాగ్ కీలక పాత్రలో నటిస్తుండగా సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా కనీసం 200 కోట్ల రూపాయల కలెక్షన్లను అన్ని భాషల్లో సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

తాజాగా బ్రహ్మాస్త్రం సినిమా నుంచి నాగ్ లుక్ రిలీజ్ కాగా ఈ నెల 15వ తేదీన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. బ్రహ్మాస్త్రం సినిమాలో నాగ్ అనీష్ శెట్టి అనే పాత్రలో కనిపించనున్నారు. అమితాబ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తుండగా రణబీర్ కపూర్ అలియాభట్ ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

దర్శకధీరుడు రాజమౌళి సమర్పిస్తూ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తుందో లేదో చూడాల్సి ఉంది. బ్రహ్మాస్త్రం సినిమా మూడు భాగాలుగా తెరకెక్కనుందని సమాచారం. బాహుబలి, కేజీఎఫ్ సినిమాలు రెండు భాగాలుగా తెరకెక్కి సక్సెస్ సాధించడంతో రెండు భాగాలుగా, మూడు భాగాలుగా తెరకెక్కే సినిమాల సంఖ్య పెరుగుతోంది.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus