‘బిగ్ బాస్4’ కు మరో హోస్ట్.. రమ్య కృష్ణే ఆప్షనా?

  • October 5, 2020 / 02:36 PM IST

‘కింగ్’ నాగార్జున ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. నూతన దర్శకుడు సాల్మన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏడాది ప్రారంభంలోనే మొదలైంది కానీ.. కరోనా వైరస్ వల్ల ఏర్పడిన లాక్ డౌన్ వల్ల వాయిదాపడింది. అయితే ఈ మధ్యనే షూటింగ్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. అయితే షూటింగ్ లో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు 2 వారాల పాటు థాయిలాండ్ వెళ్లాల్సి ఉందట.

అక్కడి వరకూ బాగానే ఉంది కానీ.. నాగార్జున మరోపక్క ‘బిగ్ బాస్4’ కు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రతీ శనివారం రోజున ఆయన షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. అదే రోజున శని,ఆదివారాల్లో టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్స్ కు సంబంధించిన షూటింగ్ ను పూర్తిచేస్తుంటారు. ఇదిలా ఉండగా.. నాగ్ కనుక ఇప్పుడు థాయిలాండ్ వెళితే, ‘బిగ్ బాస్4’ పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. గెస్ట్ గా రమ్యకృష్ణ వచ్చి హోస్ట్ చేస్తారా?? అనే డిస్కషన్లు కూడా మొదలయ్యాయి.

‘బిగ్ బాస్3’ టైంలో నాగార్జున తన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లారు. ఆ టైములో నాగార్జున లేని ఆ రెండు రోజులు రమ్యకృష్ణే హోస్ట్ చెయ్యడం జరిగింది. ఆమె హోస్ట్ చేసిన విధానానికి ప్రేక్షకుల నుండీ మంచి స్పందనే లభించింది. దాంతో ఈసారి కూడా రమ్యకృష్ణే హోస్ట్ చేసే అవకాశం ఉందని డిస్కస్ చేసుకుంటున్నారు ప్రేక్షకులు. మరి ‘బిగ్ బాస్4’ నిర్వాహకులు మనసులో ఏముందో.. తెలియాల్సి ఉంది.

1

2

3

4

5

6

7

8

9

Most Recommended Video

‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్‌’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus