Nagarjuna, Akhil: అఖిల్ మీద నాగార్జునకి అంత నమ్మకం ఎందుకో తెలుసా..!

  • November 16, 2022 / 01:24 PM IST

‘బొమ్మరిల్లు’ క్లైమాక్స్‌లో సిద్ధార్థ్, ప్రకాష్ రాజ్‌తో.. ‘ఇప్పటికీ నాచెయ్యి మీచేతుల్లోనే ఉంది నాన్నా’ అంటాడు కదా.. అచ్చం అలాగే ఉంది అక్కినేని అఖిల్ పరిస్థితి..అంటే, ఫాదర్.. సినిమాలు, దర్శకుల ఎంపిక విషయంలో తనకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదని కాదు.. రెండో కొడుకుని ‘సిసింద్రీ’ తో చిన్నప్పుడే స్టార్‌ని చేసిన కింగ్ నాగార్జున.. అఖిల్‌కి కెరీర్ స్టార్టింగ్ నుండి డిఫరెంట్ స్టోరీస్, అంతే డిఫరెంట్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేస్తూ.. స్టార్‌గా నిలబెట్టాలనే ప్లాన్ చేస్తున్నారు..

విక్రమ్ కె.కుమార్ లాంటి డైరెక్టర్ కూడా హిట్ ఇవ్వలేకపోయాడు.. ఇక మా హీరోకి హిట్ ఫిలిం ఎప్పుడు పడుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కాస్త ఊరటనిచ్చింది.. తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో మూవీ అనౌన్స్ చేసి.. ఈసారి సాలిడ్ సూపర్ హిట్ కొడతానని హింట్ ఇచ్చాడు.. కథకు తగ్గట్టే లావిష్‌గా నిర్మిస్తున్నారు అనిల్ సుంకర.. ‘ఏజెంట్’ లుక్ రిలీజ్ చేసినప్పటినుండి మంచి హైప్ వచ్చింది..

షూట్ చివర్లో ఉన్నాం.. 2023 సంక్రాంతికొస్తున్నాం అని అనౌన్స్ చేశారు.. కట్ చేస్తే ప్రభాస్ ‘ఆదిపురుష్’ పాన్ ఇండియా మూవీనే పోస్ట్‌పోన్ అయింది.. అఖిల్ సినిమా కష్టమే అన్నారు.. దీనికి థియేటర్లు దొరక్కపోవడం ఒక కారణమైతే.. అనవసరంగా వచ్చి పెద్ద సినిమాల మధ్య ఇరుక్కుపోవడం ఎందుకు అనుకుని మేకర్స్ తర్జన భర్జన పడుతుంటే.. ‘‘విడుదల విషయంలో అస్సలు వెనక్కితగ్గొద్దు.. నేను చూసుకుంటా.. ధైర్యంగా ముందుకెళ్లండి‘‘ అంటూ దర్శక నిర్మాతలకు ప్రామిస్ చేశాడట నాగ్..

చిరు, బాలయ్యలతో పాటు తమిళ్ స్టార్స్ విజయ్, అజిత్ సినిమాలు కూడా పెద్ద పండక్కే ఫిక్స్ అయిపోయాయనే సంగతి తెలిసికూడా నాగ్.. ‘ఏజెంట్’ విషయంలో అంత మొండిగా ఉన్నాడేంటి? అంటూ గుసగుసలాడుతున్న ఇండస్ట్రీ వర్గాల వారికి యూనిట్ నుండి వచ్చిన సమాధానం ఏంటంటే.. సినిమా ఔవుట్‌పుట్ విషయంలో నాగ్ ఫుల్ హ్యాపీగానే కాదు, కాన్ఫిడెంట్‌గా కూడా ఉన్నాడట.. సినిమాలో కంటెంట్ ఉన్నప్పుడు వెనకడుగు వెయ్యడం దేనికి?.. సంక్రాంతి రిలీజ్‌కి ప్లాన్ చేసేసుకోండి అని చెప్పడంతో.. సురేందర్ రెడ్డి, అనిల్ సుంకర.. నాగ్ మాట ప్రకారం అఖిల్ బాబుని ‘ఏజెంట్’ గా థియేటర్లలోకి దించడానికి సన్నాహాలు మొదలెట్టేశారు..

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus