అన్నీ ఊహించుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది..! నాగ్ అందుకే వార్నింగ్ ఇచ్చాడా..?
April 24, 2022 / 05:49 PM IST
|Follow Us
బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో నాగార్జున యాంకరింగ్ తో హౌస్ మేట్స్ కి చెమట్లు పట్టించాడు. ఈవారం నామినేషన్స్ లో వచ్చిన పాయింట్స్ కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ బిందు బాత్రూమ్ ఇష్యూ గురించి క్లారిటీ ఇచ్చాడు. అసలు అఖిల్ అక్కడ ఏం అన్నాడు. నువ్వు ఏం ఊహించుకుంటున్నావ్ అనేది క్లియర్ గా క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, ఈవిషయంలో అసలు శివ ఇన్వాల్ మెంట్ ఏంటి అనేది నిలదీసి మరీ అడిగాడు. ఫస్ట్ కన్ఫెషన్ రూమ్ లో శివతో పర్సనల్ గా మాట్లాడిన నాగార్జున ఆ తర్వాత బిందుని పిలిచి ఎక్స్ ప్లనేషన్ అడిగాడు. బాత్రూమ్ నుంచీ వచ్చేటపుడు అమ్మాయి కాబట్టి చెప్పట్లేదు అని అఖిల్ అన్నట్లుగా బిందు నామినేషన్స్ లో మాట్లాడింది.
అంతేకాదు, ఆ తర్వాత నా విషయంలో స్టాండ్ తీస్కోలేదు, శివకి ఈవిషయం తెలిసినా కూడా చెప్పడం లేదు అంటూ శివతో మాట్లాడింది. శివతో ఫ్రెండ్షిప్ కూడా కట్ చేస్కుంది. ఈ విషయంలో నాగార్జున ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. అఖిల్ అసలు అక్కడ ఏం మాట్లాడాడో క్లారిటీ ఇచ్చేందుకు అఖిల్ ని కూడా కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి ముగ్గురుకీ ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. ఆ తర్వాత బిందు చేసిన ఎలిగేషన్స్ లో అస్సలు మీనింగ్ లేదని నిరూపించాడు. పక్కకి రా అని అన్నట్లుగా మాట్లాడితే అది చాలా తప్పు అంటూ నాగార్జున క్లారిటీ ఇస్తూ వీడియో చూపించాడు. అంతేకాదు, అజయ్ స్పైన్ వీక్ అని బిందు అన్నదని, నీ బ్యాక్ చాలా వీక్ అనే మీనింగ్ లో మాట్లాడిందని వీడియోలో చూపించాడు నాగ్. దీంతో హౌస్ మేట్స్ అందరికీ కూడా ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
అసలే, వీకండ్ ఎప్పుడొస్తుందా నాగార్జున ఏ పాయింట్స్ మాట్లాడతారా వాటిని బట్టీ బయట ప్రేక్షకులకి గేమ్ ఎలా వెళ్తోంది అనేది హౌస్ మేట్స్ అంచనా వేసుకుంటారు. కానీ, ఈసారి నాగార్జున ఇచ్చే ఇన్ పుట్స్ కానీ, పీకే క్లాసులు కానీ హౌస్ మేట్స్ కి అర్ధం కావడం లేదు. వాళ్లు అనుకున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉంటోంది. ఇప్పుడు బిందు విషయంలో కూడా ఒక క్లారిటీకి రాలేకపోతున్నారు హౌస్ మేట్స్. అందుకే, ఈసారి నాగార్జున గట్టి క్లాస్ పీకాడు. అందరికీ క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో తర్వాత జరగబోయే నామినేషన్స్ వేడెక్కబోతున్నాయనే చెప్పాలి. ముఖ్యంగా అఖిల్ ఇంకా బిందు ఇద్దరి విషయంలో క్లారిటీ వచ్చింది. మరీ ఇప్పుడు నెక్ట్స్ వీక్ నామినేషన్స్ లో వీరిద్దరికి మరోసారి గట్టి ఆర్గ్యూ అయ్యేలాగానే ఉంది. ఎందుకంటే, ప్రస్తుతం అఖిల్ కెప్టెన్ కాబట్టి, బిందుకి నామినేట్ చేసే అవకాశం లేదు. కానీ, అఖిల్ బిందుని ఖచ్చితంగా లేనివి ఊహించుకుని మాట్లాడద్దనే పాయింట్ తో నామినేట్ చేసే అవకాశం కనిపిస్తోంది.
ఇక వీకండ్ నాగార్జున హౌస్ మేట్స్ కి కొన్ని నామినేషన్స్ కి పాయింట్స్ అందించినట్లుగానే కనిపిస్తోంది. బిందుకి ఇంకా అఖిల్ కి టఫ్ ఫైట్ ఉండబోతోందని ముందుగానే బిగ్ బాస్ టీమ్ ఊహించింది. అందుకే, ఇప్పుడు వీళ్లిద్దరి మద్యలో ఎవరు కరెక్ట్ ? ఎవరు రాంగ్ ? అనేది ఆడియన్స్ కి క్లారిటీ ఇస్తే ఖచ్చితంగా ఓటింగ్ అనేది మారుతుంది. ఇదే బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేసి మరీ ఈసారి నాగార్జునతో ఇలా మాట్లాడించారా అనే అనిపిస్తోంది. ఇక బిగ్ బాస్ ప్రేక్షకులు కూడా కొన్ని విషయాల్లో ఫుల్ క్లారిటీకి వచ్చేస్తారు. ప్రోమోలో అయితే బిందుకి, అఖిల్ కి గట్టిగానే క్లాస్ పడింది. మరి పూర్తి ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది చూడాలి. అదీ విషయం.